Ad
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణూదేశాయ్ జంటగా 2003 ఏప్రిల్ 25న 250 ప్రింట్లతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాల మధ్య రిలీజైన చిత్రం జానీ! పవన్ స్వీయా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలి ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశపర్చింది. ఈసినిమా రిలీజుకు ముందు నుండే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జానీ బనియన్లు, కర్చీఫ్ లు, Pepsi ఓ రేంజ్ యాడ్లు….ఓ హంగామా వాతావరణం క్రియేట్ చేసిందీ సినిమా!
Advertisement
Also Read: ఖుషి V/S నరసింహానాయుడు. ఏది పెద్ద హిట్!
జానీ సినిమా కోసం పవన్ చేసిన ప్రయోగాలు:
- ఫైటింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలోని ఫైట్ల కోసం పవన్ మాస్టర్ ఆర్ట్స్ ను లాస్ ఏంజిల్స్ లో , ఐక్విడోను జపాన్ లో ప్రత్యేకంగా నేర్చుకొని వచ్చారు.
- భిన్నమైన హెయిర్ స్టైల్ కోసం గుండు కొట్టించుకొని మరీ సినిమాకు అనుగునంగా జుట్టు పెంచాడు.
Advertisement
- ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే, దర్శకత్వం పవన్ కళ్యాణ్ యే!
- ఈ సినిమాను 90 శాతం వాయిస్ లైవ్ రికార్డింగ్ చేశారు. డబ్బింగ్ లేకుండా షూటింగ్ స్పాట్ లో సీన్ లో నటిస్తూ చెప్పిన డైలాగ్స్ నే ఫైనల్ చేశారు మరీ నాయిస్ ఎక్కువగా ఉన్న పార్ట్స్ కు మాత్రమే డబ్బింగ్ చెప్పించారు.
- ఈ సినిమాలోని రెండు పాటలను పవన్ కళ్యాణ్ స్వయంగా పాడారు.
- పవన్ మొదట స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు హీరో చనిపోతాడు. కానీ తన అభిమానులు ఈ సీన్ ను యాక్సెప్ట్ చేయరని స్క్రిప్ట్ ను మార్చాడు.
- అశించిన రీతిలో రిజల్ట్ రాకపోవడంతో ఈ సినిమాకు తీసుకున్న రెమ్మ్యునరేషన్ ను పవన్ నిర్మాతకు తిరిగి ఇచ్చేశాడు.
Also Read: షూటింగ్ లోనే స్టాప్ అయిన PSPK 4 సినిమాలు!