Home » గోరుచుట్టు నొప్పి నుండి మీ వేలు ని ఇలా రక్షించుకోండి..!!

గోరుచుట్టు నొప్పి నుండి మీ వేలు ని ఇలా రక్షించుకోండి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

గోళ్ళ దగ్గర కొంతమందికి ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల గానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల గానీ గోరుచుట్టు వస్తుంది. గోరుచుట్టు వచ్చినప్పుడు గోరు దగ్గర సెన్సిటివ్ చర్మం ఉంటుంది కాబట్టి నొప్పి బాగా ఉంటుంది. ఈ కారణంగా చాలామంది బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా వచ్చినప్పుడు మన ఇంట్లో సహజంగా ఈ గోరుచుట్టును ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే స్టెఫిలో కోకస్ బ్యాక్టీరియా, ఏంటిరో కోకస్ బ్యాక్టీరియా వీటి వల్ల గాని లేదా ఫంగస్ క్రీములైతే ఈస్ట్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి గోరుచుట్టు వస్తుంది. దీన్ని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల ఉప్పు వేసి ఒక నిమ్మకాయను అందులో పిండేసి బాగా కలపాలి.ఆ నీళ్లలో గోరు చుట్టూ ఉన్న వేలు 15 ని. పాటు ఉంచి ఇలా రోజుకు మూడుసార్లు చేస్తే ఈ గోరుచుట్టు కు సంబంధించిన క్రీములు చనిపోతాయి. అలాగే మూడు పూటలా అలోవెరా జెల్ ని ఆ వేలి మీద పెట్టి 30 ని.పాటు ఉంచితే గోరుచుట్టు తగ్గించడానికి సహాయపడుతుంది. ఇవి కాకుండా ఒక చెంచా బేకింగ్ సోడాలో ఒక కప్పు వెనిగర్ ని వేసి కలిపి అందులో గోరుచుట్టు ఉన్న వేలు పెట్టి రోజుకు మూడు సార్లు 15ని.ఉంచినా కూడా గోరుచుట్టు క్రిములను చంపేసి, దాని నొప్పిని నివారిస్తుంది. అలాగే ఆపిల్ సైడర్ వెనిగర్ లో 25 ml నీళ్ళను కలిపి అందులో గోరు చుట్టూ ఉన్న వేలిని పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఉంచినా కూడా ఫలితం ఉంటుంది. ఇది అందుబాటులో ఉంటే ఈ పద్ధతిని కూడా ఉపయోగించవచ్చు. 2 స్పూన్ ల టీ ట్రీ ఆయిల్ లో రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి ఈ రెండిటినీ కలిపి అందులో ఈ గోరు చుట్టు ఉన్న వేలిని పెట్టి ఉంచితే బ్యాక్టీరియా,ఫంగస్ క్రీములన్ని చనిపోతాయి. ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ వస్తువుల తో ప్రయత్నిస్తే చక్కటి ఫలితాన్ని పొంది గోరుచుట్టు నొప్పి తొందరగా తగ్గిపోతుంది.

Advertisement

also read;

Advertisement

వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయాల‌నుకుంటున్నారా..? అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి

వివాహం ఆలస్యం అయితే వచ్చే సమస్యలు ఏంటో తెలుసా…?

 

Visitors Are Also Reading