Telugu News » Blog » అంత బిల్డ‌ప్ ఎందుకు…స‌మంత ఏడుపు పై నిర్మాత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

అంత బిల్డ‌ప్ ఎందుకు…స‌మంత ఏడుపు పై నిర్మాత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

by AJAY
Ads

చాలా కాలం త‌ర‌వాత స‌మంత మ‌ళ్లీ మీడియా ముందుకు వ‌చ్చారు. స‌మంత న‌టించిన శాకుంత‌లం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్దంగా ఉండ‌టంతో ఆ సినిమా ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ లో స‌మంత పాల్గొన్నారు. స‌మంత ప్ర‌స్తుతం అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. విడాకులు తీసుకున్న నాటి నుండి స‌మంత ఏదో ఒక‌రకంగా బాధ‌ప‌డుతున్నారు. నాగ‌చైత‌న్య‌తో విడాకుల త‌ర‌వాత స‌మంత డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయారు.

Advertisement

ఆ డిప్రెష‌న్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చి సినిమాలు చేస్తున్న స‌మయంలో అనారోగ్యానికి గురయ్యారు. సామ్ మ‌యోసైటిస్ తో బాధ‌ప‌డుతుంద‌ని డాక్ట‌ర్ లు నిర్దారించారు. ఇక అప్ప‌టి నుండి స‌మంత కాస్త వీక్ అయ్యారు కూడా. అయితే స‌మంత శాకుంత‌లం ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ ఎమోష‌నల్ అవుతూ క‌న్నీళ్లు పెట్టుకున్నారు. య‌శోద సినిమా ప్రెస్ మీట్ లో కూడా స‌మంత మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Advertisement

Advertisement

స‌మంత అలా ఏడ‌వ‌టం అభిమానుల‌ను ప్రేక్షల‌ను క‌ల‌చివేసింది. అయితే తాజాగా ఈ ఘ‌ట‌న పై నిర్మాత చిట్టిబాబు ఓ ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స‌మంత శాకుంత‌లం సినిమా కోసం క‌ష్ట‌ప‌డినందుకు ఆ సినిమాలోని సీన్ ల‌ను త‌లుచుకుని ఏడ‌వ‌టం విడ్డూరంగా ఉంద‌ని అన్నారు.

Samantha

Samantha

అనుష్క జేజ‌మ్మ లాంటి పాత్ర‌లో న‌టించిన‌ప్పుడు..దేవ‌సేన లాంటి పాత్ర‌ల్లో న‌టించిన‌ప్పుడూ ఇంత‌లా ఎమోష‌న‌ల్ అవ్వ‌లేద‌ని కామెంట్ చేశారు. అది వాళ్ల ప్రొఫెష‌న్ న‌టించాలి. అంతే కానీ తానే ఏదో చేసిన‌ట్టు బిల్డ‌ప్ ఎందుకు అంటూ వ్యాక్యానించారు. స‌మంత‌కు వ‌చ్చిన జ‌బ్బు ప్రాణాంత‌కం కాదు….చ‌నిపోతానో బ్ర‌తుకుతానో అంటూ మాట్లాడుతుంది. స‌మంత‌కు ఎవ‌రు ఇలాంటి స‌ల‌హాలు ఇస్తున్నారో కానీ త‌ప్పుడు నిర్న‌యాలు అంటూ చిట్టిబాబు వ్యాఖ్యానించారు.