మనదేశంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇరువురు స్త్రీ పురుషులు ఒకరి జీవితంలోకి మరొకరు ఆహ్వానిస్తూ ఘనంగా జరుపుకునే వేడుకే వివాహం. వివాహాన్ని కొన్ని సందర్భాలలో పెద్దలు కుదిరిస్తే… మరి కొన్ని సందర్భాల్లో తామే తమ భాగస్వామిని ఎంచుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అందరిని ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. అయితే ప్రస్తుతం మాత్రం పాశ్చాత్య పోకడల కారణంగా చాలామంది పెళ్లిళ్లు చేసుకోవడం మానేస్తున్నారు. అంతేకాకుండా పెళ్లికి ముందే సహజీవనం చేస్తూ పిల్లలను సైతం కంటున్నారు.
Advertisement
ఆ తర్వాత నచ్చితే పెళ్లి చేసుకుంటారు… లేదంటే విడిపోతారు. కానీ నిజానికి పెళ్లి అంటే ఎక్కువ ఖర్చుతో సంతోషంగా జరుపుకునే వేడుక మాత్రమే కాదు. దాని వెనక ఎన్నో మంచి విషయాలు దాగి ఉన్నాయి. పెళ్లికి ముందు సహజీవనం చేసినప్పటికీ వారు ఇతరులకు తమ భాగస్వామి ని పరిచయం చేసేటప్పుడు తడబడుతూ ఉంటారు. అదే పెళ్లి చేసుకున్న జంట నిర్భయంగా తమ భాగస్వామి అందరికీ పరిచయం చేస్తారు. పెళ్లికి ముందు సహజీవనం సమయంలో పుట్టిన పిల్లలు సైతం ఎలాంటి బంధాలు.. బంధుత్వాలకు తేడా తెలియకుండా పెరుగుతారు.
Advertisement
అదే పెళ్లి చేసుకున్న జంట పిల్లలనుకంటే వారికి సమాజంలో ఎంతో గౌరవం కూడా దక్కుతుంది. వివాహం చేసుకుంటే ఆ రోజున వేల మంది వచ్చి ఆశీర్వదిస్తారు. దాంతో ఆ జంటకు సుఖశాంతులు కలుగుతాయి. అంతే కాకుండా పెళ్లి చేసుకున్న జంట బంధం లో తేడా వచ్చినా వందల మంది సాక్షిగా వివాహం జరుగుతుంది కాబట్టి సమాజం కోసమైనా సర్దుకుపోయి ఆ తరవాత అన్ని గొడవలు మర్చిపోయి హ్యాపీ గా ఉంటారు.
అదే సహజీవనం చేస్తున్నవారిలో గొడవలు వస్తే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. సహజీవనం చేశాక ఇద్దరూ విడిపోయి వేరే వాళ్ళను పెళ్లి చేసుకుంటే వాళ్ల జీవితంలో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా సహజీవనం కు దూరంగా ఉండి పెళ్లి చేసుకుని ఆ తరవాత కలిసి ఉండటమే ఉత్తమం.
Also read :
టిఫిన్ బండి వద్ద టిఫిన్ చేస్తున్న ఈ కోటీశ్వరుడిని మీరు గుర్తు పట్టారా..?
వామ్మో ఇదెక్కడి అగ్రిమెంట్.. దంపతుల మధ్య ఇలాంటి ఒప్పందాన్ని ఎవరైనా చూశారా..?