Home » నయన్ కి అప్పుడే వివాదాలు మొదలయ్యాయా ?? నయనతార కి పెళ్ళి కలిసిరావడం లేదా ? లేటెస్ట్ గా ..

నయన్ కి అప్పుడే వివాదాలు మొదలయ్యాయా ?? నయనతార కి పెళ్ళి కలిసిరావడం లేదా ? లేటెస్ట్ గా ..

by AJAY
Ad

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార ఇటీవల దర్శకుడు విఘ్నేశ్ శివన్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 9వ తారీఖున నయన్ విగ్నేష్ జంట మహాబలిపురంలోని ఓ రిసార్ట్స్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. వివాహానికి అతి కొద్ది మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. వారిలో షారుక్ ఖాన్, రజనీకాంత్ తో పాటు మరికొందరు ప్రముఖులు ఉన్నారు.

Advertisement

ఇదిలా ఉంటే నయన్ విగ్నేష్ ల పెళ్లిపై ముందు నుండి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. నయనతార ఇప్పటికే ప్రభుదేవ, శింబు లను ప్రేమించి పెళ్లి వరకు వెళ్లింది. కానీ వారి ప్రేమలు పెళ్లి వరకు చేరలేదు. దాంతో విగ్నేష్ తో పెళ్లి కూడా డౌటే అని అందరూ అనుకున్నారు. కానీ అనుమానాలు చెక్ పెడుతూ నయనతార విగ్నేష్ ను వివాహం చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత కూడా నయనతారను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి.

Advertisement

పెళ్లైన వెంటనే ఈ జంట తిరుమల దేవస్థానంలో దర్శనానికి వచ్చింది. దర్శనం సమయం లో నయనతార చెప్పులు వేసుకుని గుడి దగ్గరికి రావడం చర్చనీయాంశం అయింది. దీనిపై అధికారులతో పాటు భక్తులు మండిపడ్డారు. దాంతో తాను తెలిసి ఈ తప్పు చేయలేదని క్షమించాలని బహిరంగ లేఖను విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు నయనతార మరోసారి చిక్కుల్లో పడింది. పెళ్ళికి ముందు నయనతార విగ్నేష్ శివన్ ల వెడ్డింగ్ వీడియో కోసం నెట్ఫ్లిక్ సంస్థ రూపాయలు 25 కోట్లతో డీల్ కుదుర్చుకుంది.

డీల్ సమయంలో పెళ్లికి సంబంధించిన ఒక్క ఫోటోను కూడా లీక్ చేయవద్దని నెట్ ఫిక్స్ ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. కానీ ఇటీవల నయన్ విగ్నేష్ ల పెళ్లికి సంబంధించిన హెచ్ డీ ఫోటోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో నెట్ ఫ్లిక్స్ సంస్థ ఆ డీల్ రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా నయన్ విగ్నేష్ లకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్టు కూడా సమాచారం. తాము చెల్లించిన 25 కోట్లను తిరిగి ఇవ్వాలని నెట్ ఫ్లిక్స్ నోటీసుల్లో పేర్కొన్నట్టు సమాచారం.

Visitors Are Also Reading