Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » అలాంటి పాత్రలు కూడా చేస్తానంటున్న ప్రియమణి ..!

అలాంటి పాత్రలు కూడా చేస్తానంటున్న ప్రియమణి ..!

by Sravanthi Pandrala Pandrala
Ads

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో యమదొంగ సినిమాలో హీరోయిన్ గా అందరిని మెప్పించిన ప్రియమణి మనందరికీ తెలిసే ఉంటుంది. ఈ మధ్యకాలంలో సినిమాలు లేక బుల్లితెరపై సందడి చేస్తోంది. అంతేకాకుండా వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. అలాంటి ప్రియమణి సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించబోతుందని సమాచారం.. కానీ హీరోయిన్ గా మాత్రం కాదు. అయితే ఆమె యంగ్ హీరోలకు అమ్మగా, అత్తగా నటించడానికి అంగీకరిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Ad

ఒకానొక సమయంలో తన అంద, చెందాలతో అభిమానులను ఉర్రూతలూగించిన ప్రియమణి జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్న సందర్భంలో ఈ విషయాన్ని ఓ సందర్భంలో తెలియజేసిందట. అయితే గత కొంతకాలం నుంచి ప్రియమణికి సంబంధించిన సినిమాలు ఏమీ లేకపోవడంతో ఆమె సినిమాలకు పులిస్టాప్ పెట్టిందని అందరూ భావించారు. కానీ ఆమె పెట్టింది పుల్ స్టాప్ కాదని కేవలం కామ మాత్రమే అని త్వరలోనే మన ముందుకు రాబోతుందని సమాచారం.

Advertisement

అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా హీరోయిన్ ప్రియమణి ముందుకు రాబోతోంది. ఈ మధ్యకాలంలో చాలా సినిమాల్లో సీనియర్ హీరోయిన్స్ కు అమ్మ, అత్త పాత్రలు ఎక్కువగా వస్తున్నాయి. దీనివల్లే ప్రియమణి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుందని సమాచారం. అయితే ఈ విషయంపై ప్రియమణి కానీ సన్నిహితులు కానీ అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. కానీ ఆమె మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుముకత చూపించినట్టు సమాచారం అందుతుంది. మరి చూడాలి అభిమానులను ఎంతగా అలరిస్తుందో..

also read:

Visitors Are Also Reading