Home » పుష్ప 2 లో ప్రియమణి..?

పుష్ప 2 లో ప్రియమణి..?

by Azhar
Ad

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ఫ్యాన్స్ లో ఎక్కువ మంది ఎదురు చూసే సినిమా ఏది అంటే అది పుష్ప 2. గత ఏడాది ఎక్కువ అంచనాలు అనేవి లేకుండా పాన్ ఇండియా లెవల్ లో విడుదల అయ్యింది పుష్ప. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా అనేది మొత్తం ఇండియా వ్యాప్తంగా సూపర్ హిట్ అనేది అందుకుంది. అలాగే ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా ఏవ్ రేంజ్ లో వచ్చాయి. అందుకే ఈ సినిమా సీక్వెల్ పుష్ప 2 కోసం చాలా మంది చూస్తున్నారు.

Advertisement

కానీ ఈ సినిమా షూటింగ్ అనేది ఇంకా ప్రారంభం కాలేదు. కానీ ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త అనేది సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. అదేంటంటే.. ఇందులో అవార్డు విన్నర్ ప్రియమణి కూడా నటించబోతుంది అని తెలుస్తుంది. అయితే ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్ ఇప్పుడు ఈ సినిమాలో చాలా మార్పులు చేస్తున్నాడు అని తెలుస్తుంది. మొత్తం పాన్ ఇండియా ఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమా కథను సిద్ధం చేస్తున్నాడు. అందుకే ఈ సినిమా అనేది ఆలస్యం అవుతుంది.

Advertisement

ఇక అందులో భాగంగానే పుష్ప 2 లో ఫాహద్ ఫాజిల్ తో పాటుగా మరో విలన్ గా విజయ్ సేతుపతిని కూడా చూపించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇక ప్రియమణి ఇందులో విజయ్ సేతుపతి భార్యలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో ఆమెది ముఖ్యమైన పాత్ర అని సమాచారం. ఇక ఈ మధ్యే ప్రియమణి రానా, సాయి పల్లవి నటించిన విరాటపర్వంలో కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించింది. మరి ఇందులో ఎలాగా ఆమె కనిపిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ చేసిన అదే తప్పు ఇండియా చేస్తుందా…?

ఎవరికీ లేని టాలెంట్ అర్షదీప్‌కు ఉంది.. అదేంటంటే..?

Visitors Are Also Reading