Home » ఇక్క‌డ నో చెప్ప‌డం కూడా ఒక క‌ళ‌నే..ప్రియ‌దర్శి షాకింగ్ కామెంట్స్..!

ఇక్క‌డ నో చెప్ప‌డం కూడా ఒక క‌ళ‌నే..ప్రియ‌దర్శి షాకింగ్ కామెంట్స్..!

by AJAY
Ad

పెళ్లి చూపులు సినిమాతో క‌మెడియ‌న్ గా ప‌రిచ‌య‌మైన ప్రియ‌ద‌ర్శి ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. సినిమాలో నా సావు నేను స‌స్త అంటూ డైలాగ్ చెప్పి అందరి దృష్టిని ఆక‌ర్షించాడు. ఈ సినిమా మంజి విజ‌యం సాధించ‌డంతో ఆ త‌ర‌వాత వ‌రుస ఆఫ‌ర్ లు అందుకున్నాడు. మల్లేశం సినిమాలో ప్రియ‌ద‌ర్శి ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించి త‌న న‌ట‌న‌తో ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

Advertisement

Advertisement

అంతే కాకుండా రీసెంట్ గా జాతిర‌త్నాలు సినిమాలో న‌టించి ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించాడు. ప్ర‌స్తుతం క‌మెడియ‌న్ గా మరియు ఇత‌ర పాత్ర‌ల‌లో న‌టిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ప్రియ‌ద‌ర్శి తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. ప్రియ‌ద‌ర్శి మాట్లాడుతూ…. ఇప్ప‌టి వ‌ర‌కూ నాకు న‌చ్చిన పాత్ర‌లే చేశాను. నాకు న‌చ్చ‌క‌పోతే సున్నితంగా నో చెబుతాను. ఇక్క‌డ నో చెప్ప‌డం కూడా ఒక క‌ళ‌….ఎందుకంటే నో చెబితే త‌ల పొగ‌రు అని ప్ర‌చారం చేస్తారు.

ఈయ‌న కు న‌చ్చాల‌ట‌..ఈయ‌నో పెద్ద ఆర్టిస్ట్ నిన్న కాక‌మొన్న వ‌చ్చాడు ఇలా ఏదేదో అనుకుంటారు. కాబ‌ట్టి నోరు అదుపులో పెట్టుకోకుంటే చాలా జరిగిపోతాయి. ఎక్కువ ఇబ్బందిగా అనిపిస్తే మా మేనేజ‌ర్ రంగంలోకి దిగి ఇప్పుడు కాదు లేండి మ‌రోసారి చూద్దాం అంటూ మ్యానేజ్ చేస్తాడు అంటూ ప్రియ‌ద‌ర్శి వ్యాఖ్యానించారు.

Visitors Are Also Reading