Telugu News » Blog » రామ్, బోయపాటి చిత్రంలో విలన్ గా టాలీవుడ్ హీరో !

రామ్, బోయపాటి చిత్రంలో విలన్ గా టాలీవుడ్ హీరో !

by Bunty
Ads

రామ్ పోతినేని కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ‘ది వారియర్’ తర్వాత రామ్ పోతినేని తో ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. అలాగే అఖండ వంటి భారీ విజయం తర్వాత బోయపాటి దర్శకత్వం వహిస్తున్న సినిమా కూడా ఇదే. హీరోగా రామ్ 20వ చిత్రమిది. ఇక ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలవగా, వీలైనంత తొందరగా ముగించేలా ప్లాన్ చేసుకుంటున్నారట టీం.

Advertisement

అయితే తాజాగా ఈ సినిమా గురించి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో రాముని ఢీ కొట్టేందుకు ఓ యంగ్ హీరోని విలన్ గా మార్చేస్తున్నారట బోయపాటి. పవర్ ఫుల్ విల నిజాన్ని తెరమీద చూపించడంలో బోయపాటి శ్రీనుకు ఒక డిఫరెంట్ ఇమేజ్ ఉంది. జగపతిబాబు కి బోయపాటి ఇచ్చిన బూస్ట్ అతని కెరీర్ ను సూపర్ హిట్ చేసింది. అలాగే అఖండ చిత్రంలో శ్రీకాంత్ విలన్ రోల్ చేశారు.

Advertisement

ఆయనను కూడా ఎవరు ఊహించని విధంగా చూపించడంతోపాటు ఆయనలోని విలనిజాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారు బోయపాటి. ఇప్పుడు కూడా రామ్ హీరోగా చేస్తున్న సినిమాతో మరొక హీరోను విలన్ చేస్తున్నారట. ఆయన ఎవరో కాదు నీకు నాకు డాష్ డాష్ అనే చిత్రంతో పరిచయమై బస్ స్టాప్, రొమాన్స్ చిత్రాలతో మంచి గుర్తింపుని తెచ్చుకున్న ప్రిన్స్ సెసిల్. అవును ఈ సినిమాలో ప్రిన్స్ పవర్ఫుల్ విలన్ గా నటిస్తున్నారట. ఈ సినిమాలో ప్రిన్స్ రోల్ సినిమాకే హైలెట్ కానుందని తెలుస్తుంది.

Advertisement

READ ALSO : వైజాగ్ బీచ్ రోడ్డులో సీఎం జగన్ విలాసవంతమైన ఇళ్లు!