Home » తల్లితో గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ప్రధాని మోడీ..!

తల్లితో గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ప్రధాని మోడీ..!

by Anji
Ad

సాధారణంగా తల్లి అంటే ఎవరికైనా ఇష్టమే ఉంటుది. తల్లి కొడుకుపై చూపించే ప్రేమ..కొడుకు తల్లిపై చూపించే ప్రేమను మనం వర్ణించలేము. అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీకి తన తల్లి హీరాబెట్ అంటే అమితమైన ప్రేమ. తన తల్లి పుట్టిన రోజు వచ్చిందంటే చాలు.. ఎక్కడున్నా కూడా తల్లీ ఆశీర్వచనాల కోసం వెళ్తుంటారు. తల్లి కూడా ఆప్యాయంగా ప్రధాని మోడీని దగ్గరకు చేర్చుకుని ముద్దాడుతున్న ఘటనలు మనం చూశాం. తల్లిని తన దగ్గరికీ రావాలని మోడీ పిలిచానా.. సున్నితంగా ఆమె తిరస్కరించారు. తన కొడుకు దేశానికి ప్రధాని అనే గర్వం అసలు ఆమెలో కనిపించదు. తల్లి ఏడాది జూన్ లో 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోడీ తన బ్లాగ్ లో ఎంతో ఎమోషనల్ అయ్యారు. చిన్ననాటి నుంచి తల్లితో గడిపిన కొన్ని ప్రత్యేక క్షణాలను గుర్తు చేసుకున్నారు. తన మనస్సు, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో తన తల్లి యొక్క పాత్రను ప్రధాని ప్రస్తావించారు. 

Advertisement

ఇటీవల తల్లి హీరాబెన్ మోడీ 100వ ఏట అడుగుపెట్టారు. ఇది ఆమె జన్మ శతాబ్ది సంవత్సరం అని ప్రధాని తన బ్లాగ్ లో రాసుకొచ్చారు. ధృడత్వానికి ప్రతీకగా ఆమెను ప్రధాని పేర్కొన్నారు. తన చిన్నతనంలో తల్లి ఎదుర్కున్న కష్టాలను గుర్తు చేసుకున్న ప్రధాని.. తన తల్లి ఎంత సరళంగా ఉంటుందో ఆమె అసాధారణ గురించి చెప్పారు. చిన్న వయస్సులోనే ప్రధాని మోడీ తల్లి తన తల్లిని కోల్పోయినట్టు గుర్తు చేసారు. ఆమెకు మా అమ్మమ్మ ముఖం లేదా ఆమె ఒడిలో గడిపిన రోజులు కూడా గుర్తుకు లేవని, ఆమె తన బాల్యాన్ని తన తల్లి లేకుండానే గడిపిందని ప్రధాని రాసుకొచ్చారు. తల్లిదండ్రులు, తోబుట్టువులతో కలిసి వాద్ నగర్ లోని మట్టి గోడలతో ఉన్న తన చిన్న ఇంటిని ప్రధాని గుర్తు చేసుకున్నారు. తల్లి ఎదుర్కుంటున్న, విజయవంతంగా అధిగమించిన సమస్యల గురించి ప్రధాని వెల్లడించారు. తల్లి ఇంటి పనులన్నీ స్వయంగా చేయడమే కాదు.. కుటుంబాన్ని పోషించడం కోసం కొద్దిపాటి ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ఎలా పని చేస్తుందో కూడా చెప్పారు. ముఖ్యంగా ఆమె కొన్ని ఇళ్లలో పాత్రలు కడగడంతో పాటు, ఇంటి ఖర్చుల కోసం చరాఖాను తిప్పడానికి సమయాన్ని కూడా వెచ్చించేదని వర్షాల సమయంలో మా పై కప్పు లీక్ అయ్యేదని, ఇల్లు జలమయం అయ్యేదని ప్రధాని గుర్తు చేసుకున్నారు. వర్షపు నీటిని సేకరించేందుకు తల్లీ లీకేజీల కింద బకెట్లు, పాత్రలను ఉంచేవారని, ప్రతికూల పరిస్థితుల్లో తల్లి ధృడత్వానికి ప్రతీకగా ఉన్నారని ఆనాటి పరిస్థితులను ప్రధాని గుర్తు చేసుకున్నారు. 

Advertisement

Also Read :  2023 లో ప్రభాస్ కు అస్సలు బాగాలేదు.. ఆ ఇబ్బందులు తప్పవు : వేణు స్వామి

పరిశుభ్రత గురించి ప్రధాని చెబుతూ.. ఈ విషయంలో తన తల్లి ఎప్పుడూ చాలా ప్రత్యేకమైందని తెలిపారు. ముఖ్యంగా పరిశుభ్రత కోసం పరితపించే వారి పట్ల తన తల్లికి ఎంతో గౌరవం ఉందన్నారు ప్రధాని. వాద్ నగర్ లో తమ ఇంటి పక్కన ఉన్న డ్రైన్ ని శుభ్రం చేయడానికి ఎవరైనా వచ్చినప్పుడు తన తల్లి వారికి టీ ఇవ్వకుండా వెళ్లనిచ్చేవారు కాదని.. ఇతరుల సంతోషాలలో ఆనందాన్ని కనుగొనడంతో పాటు తన తల్లి ఇతరుల ఆనందాన్ని తన ఆనందంగా భావించే వారు అని ప్రధాని గుర్తు చేశారు. ప్రధాని మోడీ తండ్రికి సన్నిహిత మిత్రుడు సమీపంలో ఉన్నటువంటి గ్రామంలో ఉండేవారని, అతని అకాల మరణం తరువాత, మా నాన్న తన స్నేహితుడి కొడుకు అబ్బాస్ ని తమ ఇంటికి తీసుకొచ్చాడని.. అబ్బాస్ తమ దగ్గరే ఉంటూ చదువు పూర్తి చేశాడని ప్రధాని మోడీ తల్లి వందేళ్ల పూర్తి సందర్భంగా చెప్పుకొచ్చారు.  మరోవైపు  కన్నతల్లిని కోల్పోయిన బాధలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా కర్తవ్య బాధ్యతలను మాత్రం మరువలేదు. తల్లి హీరాబెన్ అంత్యక్రియలు ముగిసిన కొద్ది సేపటికే గవర్నర్ కార్యాలయానికి వెళ్లి సమీక్షలో పాల్గొన్నారు. అటు నేడు కోల్ కతాలో జరిగే నేషనల్ గంగా కౌన్సిల్ సమావేశంలో కూడా ప్రధాని మోడీ వర్చువల్ గా పాల్గొంటారని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి చెప్పాడు. దీంతో హ్యాట్సాప్ మోడీ, నిజమైన నాయకుడు అంటూ నరేంద్ర మోడీ అభిమానులు ప్రశంసించడం విశేషం.

Also Read : Rishabh Pant : కారు యాక్సిడెంట్‌లో టీమిండియా క్రికెటర్ రిషబ్‌ పంత్‌కు గాయాలు

Visitors Are Also Reading