Home » నాగచైతన్య పెట్టుకున్న ఈ స్పోర్ట్స్ వాచ్ ధర అన్ని లక్షలా..?

నాగచైతన్య పెట్టుకున్న ఈ స్పోర్ట్స్ వాచ్ ధర అన్ని లక్షలా..?

Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు నట వారసత్వం అంది పుచ్చుకొని స్టార్ హీరోగా ఎదిగారు నాగార్జున. ఆయన వారసులుగా ఇండస్ట్రీలోకి నాగచైతన్య,అఖిల్ లు ఎంట్రీ ఇచ్చారు. కానీ వీరు స్టార్ హీరోలుగా ఎదగలేకపోతున్నారు. ఇందులో అఖిల్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వరుస డిజాస్టర్లతో ఇండస్ట్రీలోనే చాలా డల్ అయిపోతున్నాడు. నాగచైతన్య కాస్త మెరుగ్గా ఉన్నా, స్టార్డం మాత్రం సంపాదించు కోలేకపోతున్నాడు.

also read:కేకేఆర్ కెప్టెన్ భార్యను వెంబడించి, వేధించిన ఇద్దరు దుండగులు

Advertisement

అలాంటి నాగచైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చాలా సీరియస్ గా ఉన్నారు. అయితే హైదరాబాదులో ఒక ప్రమోషన్ కార్యక్రమంలో ఆయన చాలా స్టైల్ గా కనిపించారు. ఇందులో ఆయన చేతికి ధరించిన వాచ్ అందరినీ ఆకట్టుకుంది. ఆడేమన్స్ ఫి గెట్ రాయల్ వోక్ క్రోనోగ్రాఫ్ స్పోర్ట్స్ వాచ్ ధరించాడు. ఈ వాచ్ ఎంతో చక్కని డిజైన్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. అలాంటి ఈ వాచ్ ధర లక్షల రూపాయలు ఉందట.

Advertisement

also read:“రామబాణం” ను మిస్ చేసిన మెగా హీరో ఎవరో తెలుసా?

ఇంతకీ ధర ఎంతయ్య అంటే రూ.65,78,436. అవును మీరు చదివేది నిజమే. దీని ధర అక్షరాల అరవై ఐదు లక్షల డెబ్భై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు. ఈ గడియారం అద్భుతమైన ఫీచర్లతో స్టీల్ కేస్ మరియు బోల్డ్ బ్లాక్ డయల్ తో ఉంది. ఈ వాచ్ ను ధరించి నాగచైతన్య స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్రస్తుతం ఆయన నటించిన కస్టడీ మూవీ ఈనెల 12న విడుదల కానుంది. మరి చూడాలి ఈ సినిమాతోనైనా నాగచైతన్య కంబ్యాక్ ఇస్తారా లేదంటే వెనక్కి వెళ్తారా అనేది ముందు ముందు తెలుస్తుంది .

also read:సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీపై నిఖిల్ మూవీలో క్లారిటీ ఇవ్వనున్నారా ?

Visitors Are Also Reading