ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ గురించి మరోసారి గట్టిగా చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చారు. ఈ ఇద్దరూ సుదీర్ఘకాలం పాటు చర్చలు జరిపారు. గతంలో టీడీపీ ప్రశాంత్ కిషోర్ పైన చాలా విమర్శలే చేసారు. అయితే.. ఇప్పుడు ఆయననే కలుస్తుండడంతో.. ఆయనను వైసీపీ నేతలు కార్నర్ చేస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుని కలవడం వెనుక ఉండే కారణాల గురించి చర్చలు జరుపుతున్నారు.
Advertisement
వీరిద్దరూ సుదీర్ఘకాలం పాటు చర్చలు జరపడంపై స్పందించిన మాజీ మంత్రి కొడాలి నాని.. చంద్రబాబు నాయుడు ఎంత మంది పీకేలను పెట్టుకున్నా.. సీఎం జగన్ ను ఏమీ చెయ్యలేరు అంటూ కామెంట్స్ చేసారు. చంద్రబాబు నాయుడు అవుట్ డేటెడ్ రాజకీయ నాయకుడు అని సీఎం జగన్ తో పాటు మేము కూడా చెబుతూనే ఉన్నామని అన్నారు. కొత్తగా ప్రశాంత్ కిషోర్ ని కలిస్తే మాత్రం భూమి బద్దలైపోతుందా? అని ప్రశ్నిస్తున్నారు.
Advertisement
ప్రశాంత్ కిషోర్ ను మేము పూర్తిగా వాడేశామని.. ఆయన బుర్రలో ఏమీ గుజ్జు లేదని అన్నారు. మా వ్యూహకర్తగా ప్రశాంత్ ఉన్నప్పుడు బీహార్ నుంచి వచ్చిన ప్రశాంత్ ఏమి పీకుతాడు? అని అన్నారని.. మరి ఇప్పుడు ఏమి పీకడానికి భేటీ అయ్యారో చెప్పాలని కొడాలి నాని డిమాండ్ చేసారు. అప్పట్లో ప్రశాంత్ సూచన చేయడం వల్లే జగన్ కోడి కత్తి డ్రామాలు ఆడాడని, బాబాయ్ ని చంపాడని పసుపు తమ్ముళ్లు గోల చేసారని.. మరి ఇప్పుడు ఎందుకు ప్రశాంత్ కిషోర్ ని భేటీ అయ్యారో చెప్పాలని కొడాలి నాని డిమాండ్ చేసారు. ప్రశాంత్ కిషోర్ కు, ఐప్యాక్ కు సంబంధం లేదని కొడాలి నాని అన్నారు. ఇండియా కూటమిలో చేరాలి అంటూ సీఎం మమతా పంపితేనే ప్రశాంత్ వచ్చారు అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయని.. కానీ, పార్టనర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ చర్చలను బీజేపీ తో జరుపుతూ ఉంటె.. పచ్చ తమ్ముళ్లు మాత్రం ప్రశాంత్ కిషోర్ తో చర్చిస్తున్నారు అంటూ కొడాలి నాని ఎద్దేవా చేసారు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!