Home » మావి గ్యారెంటీ లేని జీవితాలు….హీరోయిన్ ప్రణీత ఎమోషనల్…!

మావి గ్యారెంటీ లేని జీవితాలు….హీరోయిన్ ప్రణీత ఎమోషనల్…!

by AJAY
Ad

బావ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ప్రణీత. మొదటి సినిమాతోనే ప్రణీత ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. ఆ తరవాత వరుస ఆఫర్ లు అందుకుంది. టాలీవుడ్ లోని పలువురు స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా నటించింది. అత్తారింటికి దారేది సినిమాలో ప్రణీత సెకండ్ హీరోయిన్ గా నటించింది. అందం టాలెంట్ ఉన్నప్పటికీ ఈ అమ్మడు అనుకున్నమేర కెరీర్ లో సక్సెస్ అవ్వలేదు. అయితే తాజాగా ప్రణీత ఆర్టిస్టుల జీవితాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది. ఇక్కడ జీవితాలకు గ్యారంటీ ఉండదు అని పేర్కొంది.

Advertisement

Advertisement

మా జీవితాలు అంధకారం లో నిండి ఉంటాయని వ్యాఖ్యానించింది. సక్సెస్ ఫెయిల్యూర్ లను తక్కువ సమయంలోనే చూశామని తెలిపింది. గౌరవం లేని జీవితాలను గడుపుతున్నాం అని చెప్పింది. పగలు రాత్రి తేడా లేకుండా చలికి వణుకుతూ….ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ కెపాసిటీ మించి చేస్తామని చెప్పింది. ఇదంతా చేసేది ప్రేక్షకుడిని మెప్పించే ఒక్క క్షణం కోసమే అంటూ ప్రణీత ఎమోషనల్ అయ్యింది. అయితే ప్రణీత ఆఫర్ ల విషయంలో నిరాశ చెందే ఇలాంటి కామెంట్స్ చేస్తోంది అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Visitors Are Also Reading