Home » పవన్ కళ్యాణ్ ని ప్రకాష్ రాజ్ మోసం చేసాడని పవన్ ఆ సినిమా నుంచి తీసేశాడట !

పవన్ కళ్యాణ్ ని ప్రకాష్ రాజ్ మోసం చేసాడని పవన్ ఆ సినిమా నుంచి తీసేశాడట !

by AJAY

సినిమా రంగంలో నటుడిగా ఎద‌గాల‌ని చాలా మంది అనుకుంటారు. కానీ అది అంత సుల‌భం కాదు. ఏ పాత్రలో అయినా జీవించాల‌ని అనుకుంటారు. అది అనుకున్నంత ఈజీ కాదు. అలా ఏ పాత్ర అయినా చేయ‌గ‌లిగేవారినే విలక్ష‌ణ న‌టుడు అంటారు. అయితే ఆ రేంజ్ కు ఎదిగిన‌వారిలో ప్ర‌కాష్ రాజ్ కూడా ఒక‌రు. ఎమోష‌న‌ల్..కామెడీ….విల‌నిజం ఇలా ఏ పాత్ర‌లో అయినా ప్ర‌కాష్ రాజ్ జీవించేస్తారు. త‌న న‌ట‌న‌తో అబ్బురప‌రుస్తుంటారు.

అలా ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నో అధ్బుత‌మైన సినిమాల‌లో ప్ర‌కాష్ రాజ్ న‌టించారు. అంతే కాకుండా ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు.ఇక ప్ర‌కాష్ తెలుగు వారికి ఎక్కువ ద‌గ్గ‌రయ్యింది మాత్రం ప‌వ‌న్ క‌ల్యాన్ సినిమాల‌తోనే. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో ప్రకాష్ రాజ్ బ‌ద్రి, సుస్వాగ‌తం అనే రెండు సినిమాల్లో న‌టించాడు. బ‌ద్రి సినిమాలో నందా….నందా అంటూ చెప్పే డైలాగ్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

Also Read: KGFలో న‌టించిన అనంత్ నాగ్ ఎవ‌రు..? ఆయ‌న పాత్ర‌ను ఎందుకు రీప్లేస్ చేశారో తెలుసా…!

ఇక ఈ రెండు సినిమాల త‌ర‌వాత మ‌ళ్లీ ప్ర‌కాష్ రాజ్ జ‌ల్సా సినిమాలోనే క‌నిపిస్తాడు. కానీ నిజానికి గుడుంబా శంక‌ర్ లో కూడా ప్ర‌కాష్ న‌టించారు. అయితే ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ప్రకాష్ రాజ్ ప‌వ‌న్ ల మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ‌తో సినిమా నుండి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. గుడుంబా శంక‌ర్ షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ప్ర‌కాష్ త‌న త‌ల్లికి అనారోగ్యంగా ఉందంటూ మ‌ధ్య‌లో వెళ్లి పోయారు. ఆ త‌ర‌వాత త‌మిళ సినిమాలో న‌టించారు. ఈ విష‌యం ప‌వ‌న్ క‌ల్యాణ్ కు తెలిసిందే.

ప్ర‌కాష్ రాజ్ వ‌ల్ల షూటింగ్ గ్యాప్ రావ‌డంతో అత‌డిని సినిమా నుండి తీసేయాల‌ని చెప్పారు. అంతే కాకుండా నిర్మాత‌ల మండ‌లిలో కూడా ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా ప్ర‌కాష్ రాజ్ న‌టించిన సీన్లు క‌ట్ చేసి ఆ స్థానంలో ఆశిష్ విద్యార్థిని తీసుకున్నారు. ఆ త‌ర‌వాత ప‌వ‌న్ ప్ర‌కాష్ ను త‌న సినిమాల్లో తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. కానీ మ‌ళ్లీ జ‌ల్సా సినిమా స‌మ‌యంలో నిర్మాత‌లు ఇద్ద‌రి మ‌ధ్య రాజీ కుదుర్చారు. దాంతో ప్ర‌కాష్ రాజ్ మ‌ళ్లీ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో క‌లిసి న‌టించారు.

Also Read: RRR : కొమురం భీముడో పాట‌కు మీకు అర్థం తెలుసా..?

Visitors Are Also Reading