టాలీవుడ్ నటి ప్రగతి గురించి తెలియని వారుండరు. కొంతమంది సెలబ్రెటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అలా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే వారిలో టాలీవుడ్ నటి ప్రగతి కూడా ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రగతి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. సినిమాలలో హీరోలకు తల్లి, అత్త పాత్రలు చేస్తూ ప్రగతి ఫేమస్ అయ్యింది. ఎఫ్2, ఎఫ్3 సినిమాలలో ప్రగతి హీరోయిన్ తమన్నా తల్లిగా నటించి తన నటనతో ఆకట్టుకుంది.
Advertisement
ఇక ప్రగతి వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. ఆమె తన భర్తతో విడాకులు తీసుకుని విడిగా జీవిస్తున్నారు. అయితే గతంలో చాలా సందర్భాల్లో ప్రగతి రెండో పెళ్లిపై వార్తలు వచ్చాయి. తాజాగా ఆమె రెండో పెళ్లి గురించి మరోసారి ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రగతికి కొడుకు, కూతురు ఉన్న విషయం తెలిసిందే. భర్త సాయం లేకుండా కూతురు, కొడుకుని పెంచి పెద్ద చేసింది ప్రగతి.
Advertisement
అయితే, తాజాగా ఆమె రెండో పెళ్లి విషయంపై స్పందిస్తూ, పెళ్లి అని కాదు కానీ ఉంటే బాగుండేది అని చాలాసార్లు అనుకున్న. ఆయినా నా మెచ్యూరిటీ లెవెల్ కు తగ్గవాడు దొరకడం కష్టమే, కానీ, రావాలని ఉంటే మాత్రం అదే జరుగుతుంది అని నేను నమ్ముతాను. నాకంటూ కొన్ని విషయాల్లో చాలా పర్టికులర్ గా ఉంటాను. నేను 20 ఏళ్ల వయసులో ఉండి ఉంటే అడ్జస్ట్ అయ్యేదాన్ని కానీ ఇప్పుడు కష్టం, అని చెప్పుకొచ్చింది ప్రగతి.
Advertisement
READ ALSO : ఇదేందయ్య ఇదీ.. ఏటీఎంలో 500 కొడితే 2500 వస్తున్నాయ్..వీడియో వైరల్