రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవలే హఠాన్మరణం చెందిన విషయం విధితమే. ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కృష్ణంరాజు. ఇటీవల కొంత అస్వస్థతకు గురవ్వడంతో కృష్ణంరాజుని హాస్పిటల్ కి తరలించారు. ఎప్పటిమాదిరిగానే తిరిగి వస్తారనుకున్న రెబల్ స్టార్ ఇక లేరు అనే వార్తను వినిపించారు. యావత్తు సినీ ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురైంది.
Advertisement
ఇండస్ట్రీలో ప్రభాస్ హీరోగా ఎదగడానికి అవసరం అయిన ఫ్లాట్ ఫామ్ సెట్ చేసింది కృష్ణంరాజు. కృష్ణంరాజు మృతితో ప్రభాస్ పెద్ద దిక్కు కోల్పోయినట్టు అయింది. ఆయన లేరు అనే విషయాన్నే ప్రభాస్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం షూటింగ్స్‌కి కాస్త బ్రేక్ ఇచ్చి తన పెదనాన్నకి జరపాల్సిన కార్యక్రమాలపై దృష్టి సారించారట. ఇందుకోసం ప్రభాస్ 12 సంవత్సరాల తరువాత మొగల్తూరులో అడుగు పెట్టబోతున్నాడు. ఈ నెల 28న ప్రభాస్ మొగల్తూరు వెళ్లనున్నట్టు సమాచారం. ప్రభాస్‌తో పాటు కృష్ణంరాజు ఫ్యామిలీ మొత్తం మొగల్తూరు వెళ్లనుంది. 2010లో ప్రభాస్ తండ్రి మరణించినప్పుడు దిన కార్యక్రమాల కోసం ప్రభాస్ మొగల్తూరు వెళ్లాడు. ఇక ఆ తరువాత ఇప్పుడు తన పెదనాన్న కోసం వెళ్తున్నాడు.
Advertisement
Also Read : టక్కరి దొంగ సినిమా స్టోరీ వినగానే సూపర్ స్టార్ కృష్ణ ‘మహేష్’ కి ఏమని వార్నింగ్ ఇచ్చారో తెలుసా ?
ఇటీవలే హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన కృష్ణంరాజు సంస్మరణ సభకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. మంచికి మారు పేరు, ప్రేమానురాగాలతో పలకరించే కృష్ణంరాజు చనిపోవడం చాలా దురదృష్టకరమన్నారు. తన విభిన్నమైన నటనా ప్రదర్శనతో ఎన్టీఆర్, ఏఎన్నార్ తరువాత గొప్ప నటుడు అనిపించుకున్న కృష్ణంరాజు గౌరవంగా ఫిల్మ్ నగర్లో ఒక విగ్రహం ఏర్పాటు చేస్తామంటూ సభాముఖంగా వారు వెల్లడించారు.
Also Read : మంచు మనోజ్, భూమా మౌనికల రెండో పెళ్ళికి ఉన్న అసలు అడ్డంకి అదేనా?