Home » ఒక్కే ఏడాది మూడు సినిమాలతో రాబోతున్న ప్రభాస్…!

ఒక్కే ఏడాది మూడు సినిమాలతో రాబోతున్న ప్రభాస్…!

by Azhar
Ad

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి ముందువరకు రెబల్ స్టార్ గా కేవలం తెలుగు వారికే తెలిసిన ప్రభాస్.. ఒక్క బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ అనేది తెచ్చుకున్నాడు. ఇక అప్పటి నుండి ప్రభాస్ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ ఇప్పటివరకు రెండు సినిమాలు మాత్రమే విడుదల చేసాడు.

Advertisement

అందులో రాధేశ్యామ్ అనే సినిమా ఈ ఏడాదే విడుదల కాగా.. అది జనాలను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఇప్పుడు వరుస సినిమాలు అనేవి చేస్తున్న ప్రభాస్ ఒక్కే ఏడాది మూడు సినిమాలతో ప్రజల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ అనే సినిమా వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ సాలార్ సినిమాతో రాబోతున్నాడు.

Advertisement

ప్రశాంత్ నీల్ దర్శకత్వం అనేది వహిస్తున్న ఈ సాలార్ అనేది కూడా 2023 సమ్మర్ లో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. అలాగే ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న మరో సినిమా ప్రాజెక్ట్ కే. ఈ సినిమా 2024 లో విడుదల అనుకున్నారు. కానీ తాజాగా ఈ సినిమా నిర్మాత ప్రాజెక్ట్ కే షూటింగ్ 55 శాతం అయ్యిపోయింది అని పేర్కొన్నారు. అందువల్ల ఈ సినిమా కూడా వచ్చే ఏడాది చివర్లో విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

ముంబైకి షాక్ ఇచ్చిన సచిన్ కొడుకు..!

పంత్ పరువు తీసిన ఊర్వశీ…!

Visitors Are Also Reading