Home » సాలార్ టీజర్ వచ్చేది ఎప్పుడంటే…?

సాలార్ టీజర్ వచ్చేది ఎప్పుడంటే…?

by Azhar
Ad

ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో. ఒక్క బాహుబలి సినిమా ప్రభాస్ రేంజ్ లో ఇండియా వ్యాప్తంగా అమాంతం పెంచింది. ఈ సినిమాతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు ప్రభాస్. అయితే ఈ సినిమా ఇచ్చిన ఊపులో ఉన్న ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. తాను చేస్తున్న ప్రతి సినిమా దేశ వ్యాప్తంగా విడుదల అయ్యేలా చుస్కుంటున్నాడు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ వరుస సినిమాలను ప్రకటించాడు. అందులో ఇప్పటికే సాహో, రాధే శ్యామ్ అనే సినిమాలు వచ్చాయి. అయితే ఇందులో సాహో పర్లేదు అనిపించినా రాధే శ్యామ్ మాత్రం ఘోరంగా ప్లాప్ అయ్యింది.

Advertisement

అందువల్ల ప్రభాస్ సినిమాల నుండి వచ్చే కొత్త అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ తెగ ఎదురు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ 5 సినిమాలు అనౌన్స్ చేసాడు. అందులో రెండు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. ఇక ఆ రెండు సినిమాలలో ప్రభాస్ ఫ్యాన్స్ సాలార్ సినిమా గురించి ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాకు దర్శకునిగా కెజిఎఫ్ వంటి సూపర్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ ఉన్నాడు. అంత పెద్ద హిట్ తర్వాత ప్రశాంత్ నుండి అది కూడా ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా కావడంతో దీని పైన అంచనాలు అనేవి ఎంతో ఎహులో ఉన్నాయి.

Advertisement

అయితే ఈ సినిమా యూనిట్ మాత్రం సాలార్ నుండి ఎక్కువ అప్డేట్స్ అనేవి ఇవ్వడం లేదు. కానీ ఇప్పుడు సాలార్ టీజర్ గురించి ఓ వార్త అనేది చెక్కర్లు కొడుతుంది. సాలార్ చిత్ర యూనిట్ కు సంబంధించిన ఓ వ్యక్తి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో… ప్రస్తుతం సాలార్ సినిమా షూటింగ్ అనేది బ్రేక్ లో ఉంది. కానీ వచ్చే నెలలో సాలార్ సినిమా షూటింగ్ అనేది మళ్ళీ ప్రారంభం కాబోతుంది. ఇక ఆ తర్వాత సినిమా పూర్తి అయ్యేవరకు షూటింగ్ ఆగదు. ఇక ఈ షోరింగ్ అనేది ప్రారంభమైన తర్వాత సాధ్యమైనంత తొందటగా టీజర్ అనేది వస్తుంది అని ప్రకటించాడు. ఇక ఈ కామెంట్స్ తర్వాత రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఇవి కూడా చదవండి :

పాండ్య రిటైర్మెంట్ ఇస్తాడు అని చెప్పిన రవిశాస్త్రి..!

రిపోర్టర్ వింత ప్రశ్న… అద్భుతమైన సమాధానం ఇచ్చిన చాహల్..!

Visitors Are Also Reading