Home » ప్రభాస్ సంపాదన టాలీవుడ్ స్టార్స్ 12 సినిమాలకు సమానమా…?

ప్రభాస్ సంపాదన టాలీవుడ్ స్టార్స్ 12 సినిమాలకు సమానమా…?

by Azhar
Ad
రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు టాలీవుడ్ హీరో కాదు. ఇండియన్ హీరో.. పాన్ ఇండియా హీరో. ప్రభాస్ ను ఆ రేంజ్ కు తీసుకెళ్లింది బాహుబలి సినిమా. ఈ సినిమా ముందువరకు కేవలం తెలుగులో మాత్రమే ప్రభాస్ సినిమాలు చేసేవాడు. కానీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ బాహుబలి సినిమా ప్రభాస్ కెరియర్ ను మొత్తం మార్చేసింది. అప్పటినుండి కేవలం పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తున్నాడు ప్రభాస్. బాహుబలి ముందు వరకు ప్రభాస్ కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అది పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి వల్ల తర్వాతనే ప్రభాస్ పేరు వచ్చేది.
కానీ ఇప్పుడు ఆ అందరి హీరోలను దాటేసి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అలాగే రెమ్యునరేషన్ కూడా ఆ రేంజ్ లోనే తీసుకుంటున్నాడు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన… సాహో, రాధేశ్యామ్ అనే సినిమాలు అంతగా ఆడలేదు. ప్లాప్ టాక్ వచ్చిన తర్వాత కూడా బాగానే వసూల్ చేసాయి. అందుకే ప్రభాస్ కు సినిమాల అవకాశాలు గాని… రెమ్యునరేషన్ గాని తగ్గకపోవడమే అందుకు నిదర్శనం. అయితే ప్రభాస్ లైన్ లో ఇప్పుడు 5 సినిమాలు ఉన్నాయి. అందులో మూడు షూటింగ్ జరుగుతుండగా.. ఇంకా రెండు మొదలు కావాల్సి ఉంది. అయితే ఈ ఐదు సినిమాలకు కలిపి ప్రభాస్ 600 కోట్ల రెమ్యునరేషన్ అనేది తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.
ప్రభాస్ ఒక్కో సినిమాకు ప్రస్తుతం 120 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఇక ఈ మొత్తం మన టాలీవుడ్ స్టార్స్ అందుకోవాలంటే కనీసం 12 సినిమాలు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మహేష్, ఎన్టీఆర్ వంటి హీరోలు సినిమాకు 50 నుండి 60 కోట్లు వసూల్ చేస్తున్నారు. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా కంటే ముందు రామ్ చరణ్, పుష్ప సినిమా కంటే ముందు అల్లు అర్జున్ కేవలం 30 కోట్ల వరకే అందుకునేవారు. కాబట్టి ఈ లేకనా చూస్తే ప్రభాస్ 5 సినిమాలతో సంపాదించేది ఈ హీరోలకు కనీసం 12 సినిమాలు చేస్తే తప్ప రాదు అనేది అర్ధం అవుతుంది. ఈ లెక్కతో వీరు ప్రభాస్ ను అందుకోవడానికి ఇంకా 5 ఏళ్ళు అయిన పడుతుంది. మరి ఈ 5 ఏళ్ళలో ప్రభాస్ ఇంకా ఎంత ఎత్తుకు వెళ్తాడు అనేది తెలియదు.

Advertisement

Visitors Are Also Reading