Ad
రెబల్ స్టార్ ప్రభాస్… మన తెలుగు అభిమానులందరికి డార్లింగ్ గా బాగా పరిచయం. తెలుగులో ఈశ్వర్ సినిమాతో ఆరంగేట్రం చేసిన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో. అతడిని అంతలా మార్చేసింది బాహుబలి. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షలో వచ్చిన బాహుబలి సినిమా ఇండియా మొత్తం చర్చగా మారింది. ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2 సినిమా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఈ దెబ్బతో పాన్ ఇండియా హీరోగా మారిపోయినా ప్రభాస్ రెమ్యునరేషన్ భారీగా పెంచేసాడు అనే వార్తలు వచ్చాయి.
కానీ బాహుబలి తర్వాత ఇప్పటివరకు ప్రభాస్ యొక్క రెండు సినిమాలు విడుదలయ్యాయి. అందులో మొదటి సినిమా సాహో. ఈ సినిమా మన సౌత్ లో పెద్దగా జనాలను ఆకట్టుకోలేకపోయిన బాలీవుడ్ లో మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ ఏడాది ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన రాధేశ్యామ్ సినిమా మాత్రం ప్లాప్ అయ్యింది. కానీ ఈ రెండు సినిమాలు యువీ క్రియేషన్స్ లో తెరకెక్కాయి. ఈ బ్యానర్ ప్రభాస్ సొంత బ్యారన్ అనుకోవచ్చు. అందువల్ల ఈ సినిమాలకు ప్రభాస్ ఎంత తీసుకున్నాడు అనేది మాత్రం తెలియదు. కానీ ఇప్పుడు ప్రభాస్ తాజాగా చేస్తున్న సినిమాలు వేరే బ్యానర్లో. దాంతో ప్రభాస్ రెమ్యునరేషన్ అనేది బాయటకు వచ్చింది.
ప్రస్తుతం రెబల్ స్టార్ చేస్తున్న సినిమాలో ఆదిపురుష్ కూడా ఒక్కటి. ఈ సినిమాను T-సిరీస్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు ముందు వచ్చిన రెండు సినిమాలు ప్లాప్ అయిన కూడా.. ప్రభాస్ రెమ్యునేషన్ భారీగా పెంచినట్లు తెలుస్తుంది. గత సినిమా వరకు 100 కోట్లు తీసుకున్న ప్రభాస్ ఈ సినిమా కోసం 20 శాతం పెంచి.. 120 కోట్లు తీసుకుంటున్నాడట. దాంతో 500 కోట్ల బడ్జెట్ తో వస్తువు ఈ సినిమాలో 20 శాతం కంటే ఎక్కువ ప్రభాస్ రెమ్యునరేషన్ కె పోతుంది అనేది అర్ధం చేసుకోవచ్చు. చూడాలి మరి ఏ సినిమా అయిన ప్రభాస్ కు హిట్ ఇస్తుందా.. లేదా అనేది.
ఇవి కూడా చదవండి :
ఇండియా , పాకిస్థాన్ క్రికెట్ లో ఉన్న తేడా ఏంటో చెప్పిన ప్లేయర్…!
కోహ్లీ ఆగ్రహానికి గురైన అభిమాని.. వీడియో వైరల్..!
Advertisement