Home » మారుతితో సినిమాకు ప్రభాస్ రికార్డుస్థాయిలో రెమ్యునరేషన్…!

మారుతితో సినిమాకు ప్రభాస్ రికార్డుస్థాయిలో రెమ్యునరేషన్…!

by AJAY
Ad

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బడా బడా దర్శకులతో ప్రభాస్ సినిమాలు చేస్తున్నాడు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సలార్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ఆది పురుష్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాను పూర్తి చేశాడు.

Prabhas with maruthi

Advertisement

ఇదిలా ఉంటే ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారని ఫిల్మ్ నగర్ లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు అంటూ కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఈ సినిమాలో మిగతా సినిమాను కంటే త్వరగా పూర్తి చేస్తారని కూడా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఇక తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి మరో ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ కు ముందుగానే 50 కోట్ల అడ్వాన్స్ ఇచ్చేందుకు డి.వి.వి.దానయ్య సిద్ధమయ్యారట. అంతేకాకుండా ఈ చిత్రానికి ప్రభాస్ వంద కోట్ల రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నారట అందువల్లే ప్రభాస్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

Visitors Are Also Reading