Home » క్రేజ్ లేదని ప్రభాస్ ను తప్పించిన సినిమా ఏదో తెలుసా…?

క్రేజ్ లేదని ప్రభాస్ ను తప్పించిన సినిమా ఏదో తెలుసా…?

by Azhar
Ad

ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరో ఎవరు అంటే.. తప్పకుండ ప్రభాస్ పేరు వినిపించదు. ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు కేవలం తెలుగు హీరో కాదు. పాన్ ఇండియా హీరో. అందుకే ఇండియాలో టాప్ హీరో ఎవరు అంటే అప్పుడు ప్రభాస్ పేరు అనేది వినిపిస్తుంది. అయితే కేవలం తెలుగులోనే ఎన్నో సినిమాలు చేసి.. సూపర్ హిట్స్ అందుకున్నాడు ప్రభాస్. అలాగే ఇక్కడ ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ప్రభాస్ చేసిన బాహుబలి సినిమా అనేది తన రేంజ్ ను మార్చేసింది.

Advertisement

పాన్ ఇండియా లెవల్ లో విడుదల అయిన ఈ సినిమాకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా మొత్తం 1900 కోట్ల కంటే ఎక్కువ వసూల్ చేసింది. దాంతో అప్పటి నుండి పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తున్నాడు ప్రభాస్. అయితే తన సినిమాలు అనేవి ప్లాప్ అయిన కూడా ప్రభాస్ రేంజ్ తగ్గడం లేదు. వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అలాగే ప్రతి సినిమాకు రెమ్యునరేషన్ విషయంలో కూడా ప్రభాస్ తగ్గడం లేదు. 100 కోట్లకు తక్కువగా ఏ సినిమాకు తీసుకోవడం లేదు. అయితే ఇప్పుడు ఇంత క్రేజ్ ఉన్న ప్రభాస్ ను క్రేజ్ లేదని ఓ సినిమా నుండి తీసేసిన విషయం చాలా మందికి తెలియదు.

Advertisement

2004లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వెనకటేష్ హీరోగా ఘర్షణ అనే సినిమా వచ్చింది. వెంకీ మామ పోలీస్ గా కనిపించిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. అయితే ఈ సినిమాలో మొదట ప్రభాస్ ను హీరోగా అనుకున్నారు. పూజ కార్యక్రమాలు కూడా చేసారు. కానీ ఆ తర్వాత ప్రభాస్ కు క్రేజ్ ఎక్కువగా లేదు అని.. ఈ సినిమా నుండి తప్పించి అప్పుడు స్టార్ హీరోగా ఉన్న వెంకటేష్ ను ఇందులో హీరోగా తీసుకున్నారు. అయితే ఇంత జరిగిన కూడా ప్రభాస్ అవి పట్టించుకోకుండా.. ఘర్షణ ఆడియో రిలీజ్ వేడుకలకు వచ్చాడు.

ఇవి కూడా చదవండి :

నేను ఇలా ఎదగడానికి ఆ ఎడిటర్ కారణం..!

సెంచరీలు చేసినప్పుడు మాట్లాడలేదు… ఇప్పుడు కూడా మాట్లాడకూడదు..!

Visitors Are Also Reading