మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రాభాస్ కాంబోలో పాన్ వరల్డ్ సినిమాను తెరకెక్కిస్తున్నట్ట ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ ను ప్రాజెక్ట్ కే గా ఖరారు చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ భామ దీపికాపదుకునే నటిస్తున్నారు. అంతే కాకుండా ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ ను నేడు హైదరాబాద్ లో మొదలు పెట్టారు. దాంతో షూటింగ్ కోసం దీపికా పదుకునే నేడు ముంబై నుండి హైదరాబాద్ కు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
Advertisement
ఇక ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించబోతున్నారని టాక్ కూడా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమా షూటింగ్ కోసం నేడు నానులాక్స్ అనే కెమెరాను వాడారు. ఈ కెమారా ధర ఏకంగా 5వేల డాలర్లపైనే ఉంటుందని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో వీఎఫ్ ఎక్స్ భారీగా ఉంటుందని ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్ వెల్లడించారు.
Advertisement
అదేవిధంగా కేవలం ఇండియాలోని అన్ని భాషల్లో మాత్రమే కాకుండా ప్రపంచంలోనే అన్ని భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తామని కూడా ప్రకటించారు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని ఇప్పటి వరకూ దేశంలోనే అలాంటి సినిమా రాలేదని కూడా చెప్పుకొచ్చారు. నాగ్ అశ్విన్ సినిమా గురించి చెప్పిన మాటలతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక ప్రాజెక్ట్ కే ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.