Home » ఫ్లాప్ సినిమా “మున్నా” కోసం 2 బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్న ప్రభాస్…! ఆ సినిమాలు ఏవంటే…?

ఫ్లాప్ సినిమా “మున్నా” కోసం 2 బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్న ప్రభాస్…! ఆ సినిమాలు ఏవంటే…?

by AJAY
Ad

బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమా విజయం తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా వ్యాప్తంగానే విడుదలవుతున్నాయి. రీసెంట్ గా ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా టీజర్ విడుదలైంది. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించిన ఈ సినిమా పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ సినిమాతో పాటూ ప్ర‌భాస్ సలార్, ప్రాజెక్ట్ కే సినిమాల‌లోనూ నటిస్తున్నాడు.

Advertisement

ప్రభాస్ కేవలం ఒకే రకమైన కథల‌లో కాకుండా మాస్… క్లాస్ రొమాంటిక్ ఇలా అన్ని రకాల సినిమాల్లో వివిధ పాత్రల‌లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలతో పాటు ఫ్లాప్ సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. ప్రభాస్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మున్నా సినిమా వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ‌ప‌రిచింది.

Advertisement

అయితే ఈ సినిమా కంటే ముందు ప్రభాస్ తనకు వచ్చిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను రిజెక్ట్ చేసి చివరగా మున్నా కథకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం…. దిల్ రాజు ప్రభాస్ తో సినిమా చేయాలనుకున్నప్పుడు మొదటగా సుకుమార్ తో ఆర్య సినిమా కథను చెప్పించాడు. కానీ ప్రభాస్ లవ్ స్టోరీ సినిమా తనకు సెట్ అవ్వదు అని రిజెక్ట్ చేశాడు.

ఆ తర్వాత అదే ఆఫర్ అల్లు అర్జున్ పెళ్లింది. ఇక అల్లు అర్జున్ గంగోత్రి తర్వాత ఆర్య సినిమాతోనే హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న‌ సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన భద్ర సినిమా ఆఫర్ కూడా మొదట ప్రభాస్ కే వచ్చింది. భద్ర సినిమా డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను మొద‌ట ప్ర‌భాస్ కు కథ వినిపించాడు. కానీ ప్ర‌భాస్ బోయ‌పాటికి అదే మొద‌టి సినిమా కావ‌డం వ‌ల్ల వెన‌క‌డుగు వేశాడు. ఇక చివరగా దిల్ రాజు వంశీ పైడిపల్లి తో మున్నా సినిమా కథను ప్ర‌భాస్ కు వినిపించాడు. ఆ క‌థ‌ ప్రభాస్ కు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడు. అలా ప్రభాస్ మున్నా కోసం రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్నాడు.

Visitors Are Also Reading