Home » రిపోర్ట‌ర్ ప్ర‌శ్న‌కు ప్ర‌భాస్ పంచ్ మామూలుగా లేదుగా..!

రిపోర్ట‌ర్ ప్ర‌శ్న‌కు ప్ర‌భాస్ పంచ్ మామూలుగా లేదుగా..!

by AJAY
Ad

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వ‌రుస సినిమాలు చేస్తున్నారు. బాహుబలి సినిమాతో ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఈ సినిమా త‌ర‌వాత అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ఇప్ప‌టికే ప్ర‌భాస్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రాధేశ్యామ్ సినిమాను పూర్తి చేశాడు. ఈ సినిమా విడుద‌లకు సిద్దంగా ఉంది. మ‌రోవైపు ఆదిపురుష్ అనే సినిమాలో కూడా ప్ర‌భాస్ న‌టిస్తున్నాడు. ఈ సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది.

Advertisement

మరోవైపు ప్ర‌భాస్ కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్ అనే సినిమాలో కూడా న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ద‌శలో ఉంది. ఇక ఈ సినిమాలు షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు.

Advertisement

prabhas

prabhas

ఈ సినిమా క‌థ ఏకంగా పాన్ వ‌రల్డ్ రేంజ్ లో ఉంటుంద‌ని అందువ‌ల్లే ఈ సినిమాను జ‌పాన్ స్పానిష్ తో పాటూ ఇత‌ర భాష‌ల్లోనూ విడుద‌ల చేస్తున్న‌ట్టు నాగ్ అశ్విన్ వెల్ల‌డించారు. ఈ సినిమా త‌ర‌వ‌త ప్ర‌భాస్ అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగాతో కూడా ఓ సినిమాకు ఓకే చెప్పాడు. ఇదిలా ఉంటే ప్ర‌భాస్ హీరోగా న‌టించిన రాధే శ్యామ్ విడుద‌ల ద‌గ్గ‌ర‌పడుతున్న నేప‌థ్యంలో ప్ర‌మోష‌న‌ల్ కార్య‌మాల‌లో బిజీగా ఉంటున్నాడు.

radhe shyam

radhe shyam

ఈ నేప‌థ్యంలోనే ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ రిపోర్ట‌ర్ ప్ర‌శ్న‌కు అదిరిపోయే పంచ్ వేశాడు. రాధేశ్యామ్ సినిమా క్లైమాక్స్ లో డెస్టినీ గెలుస్తుందా ప్రేమ గెలుస్తుందా అని రిపోర్ట‌ర్ ప్ర‌శ్నించాడు. దానికి ప్ర‌భాస్ కొంచె రూ.50 టికెట్ అయినా కొనుక్కుని సినిమా చూడాలి క‌దా. ప్రొడ్యూస‌ర్ 300 కోట్లు పెట్టి సినిమా తీసాడు. న‌న్ను చంపేస్తాడు. అంటూ రిపోర్ట‌ర్ కు ప్ర‌భాస్ కౌంట‌ర్ ఇచ్చాడు. దాంతో రిపోర్ట‌ర్ సైలెంట్ అయ్యాడు.

Visitors Are Also Reading