Home » ప్రభాస్ సినిమా టైటిల్ ఛేంజ్..?

ప్రభాస్ సినిమా టైటిల్ ఛేంజ్..?

by Azhar
Ad

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. అయితే బాహుబలి సినిమాతో ఎంతో క్రేజ్ అనేది సంపాదించుకున్న ప్రభాస్ ఆ తర్వాత చేసిన రెండు సినిమాలతో అనుకున్న ఫలితం అనేది పొందలేకపోయాడు. కానీ ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకుంటున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు అనేవి చేస్తున్నాడు. అందులో ఇప్పటికే ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తి కాగా.. సాలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి.

Advertisement

ఈ క్రమంలోనే కొత్తగా టాలీవుడ్ సైరెక్టర్ మారుతితో కూడా ఓ సినిమా అనౌన్స్ చేసిన ప్రభాస్.. దానిని కూడా ప్రారంభించాడు. అయితే ఈ సినిమాను రాజా డీలక్స్ పేరుతో రిజిస్టర్ చేయించి అదే పేరుతో షూటింగ్ అనేది చేస్తున్నారు. దాంతో అందరూ ఈ సినిమా టైటిల్ అనేది రాజా డీలక్స్ అని ఫిక్స్ అయ్యారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క టైటిల్ ను ఛేంజ్ చేసినట్లు తెలుస్తుంది.

Advertisement

ప్రభాస్ ఇప్పుడు కేవలం తెలుగులో కాకుండా.. తాను చేసే ప్రతి సినిమాను ఇండియా వ్యాప్తంగా విడుదల చేస్తున్నాడు. అందుకే ప్రభాస్ నుండి వస్తున్న ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ కాకుండా .. అన్ని భాషల్లో సరిపోయే విధంగా కొత్త టైటిల్ అనేది పెట్టాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది అని సమాచారం. కానీ వారు పెట్టాలి అనుకుంటున్న కొత్త టైటిల్ ఏంటి అనేది మాత్రం తెలియదు.

ఇవి కూడా చదవండి :

ఇండియాను క్యాష్ చేసుకోవాలనుకున్న ఇంగ్లాండ్..!

క్రికెట్ లో ఆ నియమాన్ని మార్చాలి.. అది ఘోరం..!

Visitors Are Also Reading