Telugu News » Blog » ప్రభాస్ ఎంగేజ్మెంట్ పిక్స్… వేదిక అక్కడే… వైరల్ ట్వీట్!

ప్రభాస్ ఎంగేజ్మెంట్ పిక్స్… వేదిక అక్కడే… వైరల్ ట్వీట్!

by Bunty
Ads

టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో హీరో ప్రభాస్ హీరోయిన్ కృతి సనన్ తో ప్రేమలో మునిగి తేలుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్-కృతి సనన్ కలిసి ఆది పురుష్ అనే సినిమాలో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కృతి సనన్ మాట్లాడుతూ ప్రభాస్ ఒప్పుకుంటే అతన్ని పెళ్లి చేసుకుంటా, అంటూ ఆసక్తికర కామెంటు చేశారు.

Advertisement

కానీ, ప్రభాస్ మాత్రం నోరు విప్పలేదు. మొన్నటికి మొన్న బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకు వచ్చిన ప్రభాస్ మాట జారలేదు. దీంతో వీరిద్దరి మధ్య ఎటువంటి ప్రేమాయణం లేదని, అవన్నీ రూమర్స్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇంతగా క్లారిటీ ఇచ్చిన ప్రభాస్-శృతిల పెళ్లి గురించి వార్తలు మాత్రం తగ్గలేదు.

Advertisement

తాజాగా బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు ట్వీట్ రెండు ఇండస్ట్రీలను షేక్ చేస్తోంది. “బ్రేకింగ్ న్యూస్, వచ్చేవారం మాల్దీవుల్లో ప్రభాస్-కృతి సనన్ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు. వారు కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది” అంటూ ఉమైర్ సందు ట్వీట్ చేశాడు. ప్రభాస్-కృతి సనన్ ఎంగేజ్మెంట్  మాల్దీవ్స్ లో జరుగుతుందని కూడా పేర్కొన్నారు. దీంతో ప్రభాస్ పెళ్లిపై  పుకార్లు మరింత వైరల్ గా మారాయి. ఇక ప్రభాస్ అభిమానులు ఆడుకోవడం మొదలుపెట్టారు. లైక్స్ కోసం ఏది వస్తే అది మాట్లాడకు అంటూ ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

read also : ధావన్ కెరీర్ నాశనం చేస్తున్న మాజీ భార్య…వాటిని లీక్ చేస్తానంటూ బెదిరింపులు !