Home » నా కొడుకు బ్రాంబు బాబు అంటూ చంద్ర‌హాస్ గొప్ప‌లు చెప్పిన ప్ర‌భాక‌ర్..నెట్టింట వైర‌ల్..!

నా కొడుకు బ్రాంబు బాబు అంటూ చంద్ర‌హాస్ గొప్ప‌లు చెప్పిన ప్ర‌భాక‌ర్..నెట్టింట వైర‌ల్..!

by AJAY
Ad

సీరియ‌ల్స్ ద్వారా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన న‌టుడు ప్ర‌భాక‌ర్. ఈటీవీలో ప‌లు సూప‌ర్ హిట్ సీరియ‌ల్స్ లో న‌టించి ప్ర‌భాక‌ర్ అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ప్రభాకర్ సినిమాలు, సీరియల్స్ లో నటిస్తూ దర్శకత్వం మరియు నిర్మాణం కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ ఒక్క‌ సినిమా గానీ సీరియల్ లో గానీ నటించకపోయినా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నాడు. రీసెంట్ గా చంద్రహాస్ పుట్టిన‌రోజు సందర్భంగా ప్రభాకర్ రెండు సినిమాలను అనౌన్స్ చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Advertisement

కాగా యాటిట్యూడ్ వల్ల చంద్ర‌హాస్ ట్రోల్స్ కు గురయ్యాడు. ప్రెస్ మీట్ లో సరిగ్గా చూడకుండా దిక్కులు చూస్తూ యాటిట్యూడ్ ను ప్రదర్శించాడు. దాంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. ఎక్కడ చూసినా చంద్రహాస్ మీమ్స్ మరియు వీడియోలే కనిపిస్తున్నాయి. దాంతో ప్రభాకర్ కూడా పలు మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Advertisement

మీడియా ముందు ఎలా మెలగాలో నా కొడుక్కి ఇంకా తెలియదని…. మెల్లమెల్లగా అన్నీ వాడే నేర్చుకుంటాడని అన్నాడు. తన కుమారుడి గురించి చెబుతూ మా వాడికి బ్రాండ్ పిచ్చి బాగా ఉంది. నాకు అలాంటి పట్టింపులు ఏమీ ఉండవు. ఏదో ఒకటి వేసుకుందామని అనుకుంటానని అన్నాడు. కానీ మా వాడు మాత్రం బ్రాండ్ దుస్తులు వేసుకుంటాడు అని చెప్పాడు. తనకు ఏ గాడ్జెట్ అయినా వస్తువైనా బ్రాండెడ్ ఉండాలని కోరుకుంటాడ‌ని తెలిపాడు.

అంతేకాకుండా ఓసారి అమెరికా నుంచి వాచ్ తీసుకు వ‌స్తే ఇది బ్రాండ్ కాదు అంటూ పక్కన పడేసాడని తెలిపాడు. వస్తువును చూడగానే అది బ్రాండా కాదా అనే విషయంలో ఇప్పటి పిల్లలు ఇట్టే కనిపెట్టేస్తార‌ని అన్నాడు. అంతేకాకుండా మంచో చెడో సినిమా చేయకుండానే చంద్రహాస్ కు చాలా పాపులారిటీ వచ్చిందని చెప్పాడు. ఎంతో డబ్బులు ఖర్చు పెడితే కానీ ఇలాంటి ప్రచారం జరగదని అన్నాడు. ప్రస్తుతం రెండు చంద్ర‌హాస్ రెండు వేరే బ్యానర్లలో సినిమాలు చేస్తున్నాడని ఓ సినిమా తన సొంత బ్యానర్ లో చేస్తున్నాడ‌ని చెప్పాడు. చంద్రహాస్ ఇంట్లో నుండి పది లక్షలు తీసుకుని ఆర్ఆర్ఆర్ కవర్ సాంగ్ చేయగా ఆ సాంగ్ చూసి సినిమా ఆఫర్ వచ్చిందని తెలిపాడు.

Visitors Are Also Reading