Home » ఎనిమిది కార్ల‌ను ఒకేసారి కొనుగోలు చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అందుకోస‌మేనా..?

ఎనిమిది కార్ల‌ను ఒకేసారి కొనుగోలు చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అందుకోస‌మేనా..?

by Anji
Ad

జ‌న‌సేన అధినేత, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి తెలియ‌ని వారుండ‌రు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రొక వైపు రాజ‌కీయాల్లో రాణిస్తున్నారు. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా షూటింగ్ కూడా నిలిపేశారు. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిన విధంగా క్రిష్ మార్పులు చేయ‌క‌పోవ‌డంతో ఆ మార్పులు చేసే వర‌కు తాను సెట్ వ‌ద్ద‌కు రాన‌ని ప‌వ‌న్ చెప్పేశార‌ట‌. దీంతో ఆ సినిమాకు తాత్కాలికంగా బ్రేక్ ప‌డింది. ఇక మ‌రొక ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో బిజీగా ఉన్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఎన్నిక‌ల‌కు రెండేండ్ల స‌మ‌యం ఉండ‌డంతో ఇప్ప‌టి నుండే క‌స‌ర‌త్తును మొద‌లుపెట్టారు. ఇక ఈసారి టీడీపీ లేదా బీజేపీతో ప‌వ‌న్ పొత్తు పెట్టుకొని పోటీ చేసే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి.

Advertisement

ఇదిలా ఉండ‌గా.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజాగా 8 కార్లను ఒకేసారి కొనుగోలు చేయ‌డం విశేషం. అన్ని ఒకే బ్రాండ్‌కు సంబంధించిన ఒకే మోడ‌ల్ కార్లు కావ‌డం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల కోసం అక్టోబ‌ర్ 05 నుంచి 3 లేదా 6 నెల‌ల పాటు వ‌రుస‌గా పాద‌యాత్ర చేప‌ట్టాల‌ని నిశ్చ‌యించుకున్నాడ‌ట‌. పాద‌యాత్ర‌లో సిబ్బందికి ఈ కార్లు ఉపయోగ‌ప‌డుతాయ‌ని ప‌వ‌న్ భావిస్తున్నార‌ట‌. వ‌చ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్ప‌టి నుంచే ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ణాళిక సిద్ధం చేసుకుంటున్నాడు.

Advertisement


ప‌వ‌న్ రోడ్డు షోల‌లో భాగంగా అన్ని కుదిరితే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు షూటింగ్ కూడా చేస్తార‌ట‌. లేక‌పోతే ఇక అంతే సంగ‌తులు. కానీ అప్ప‌టిలోపు సాయిధ‌ర‌మ్ తేజ్‌తో క‌లిసి వినోద‌య సీత‌మ్ అనే రీమెక్‌లో న‌టించ‌నున్నారు. ఇందుకు ప‌వ‌న్ 20 రోజుల కాల్షీట్స్ ఇచ్చాఆరు. హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న భ‌వ‌దీయుడు భ‌గ‌త్‌సింగ్‌, అదేవిధంగా సురేంద‌ర్‌రెడ్డి సినిమాల‌పై మాత్రం ఇంకా క్లారిటీ లేద‌నే చెప్పాలి. 2024 ఎన్నికల త‌రువాత తెర‌మీదికి రానున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ప‌వ‌న్ ఎలాగైనా అధికారంలోకి రావ‌డం కోసం రెండేండ్ల ముందు నుంచే సిద్ధ‌మ‌వుతుండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ఇక ప‌వ‌న్ రాజ‌కీయాల్లో, సినిమాల్లో రెండింటిలో ఎలా రాణిస్తారో తెలియాలంటే మాత్రం వేచి చూడ‌క త‌ప్ప‌దు.

Also Read : 

రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌.. వ‌న్డేల్లో ట్రిపుల్ సెంచ‌రీ..!

పెళ్లి జ‌రిగిన ఎనిమిదేళ్ల‌కు భార్య‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన భ‌ర్త‌…. ఆ స‌ర్‌ఫ్రైజ్ తో అంద‌రూ ఆశ్చ‌ర్యం..!

Visitors Are Also Reading