Home » Post office recruitment 2022: ఎలాంటి ఫీజు లేకుండా 98వేల జాబులు.. అర్హత ఏంటంటే..?

Post office recruitment 2022: ఎలాంటి ఫీజు లేకుండా 98వేల జాబులు.. అర్హత ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala

చాలా రోజుల నుంచి నిరుద్యోగులు పోస్టల్ డిపార్ట్మెంట్ లో జాబుల కోసం ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యి నోటిఫికేషన్ కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 98,083 జాబులకు నోటిఫికేషన్ విడుదల చేశారు.. అర్హత కలిగిన నిరుద్యోగులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ జాబ్ కి అప్లై చేసుకోండి. రిక్రూట్మెంట్ కూడా ఇదే సంవత్సరం ఉంటుందని తెలియజేస్తున్నారు.. మరి అప్లై చేసే విధానం.. మిగతా ప్రాసెస్ చూద్దాం..

మొత్తం ఖాళీల సంఖ్య:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో :
2289 పోస్ట్ మాన్ ఉద్యోగాలు.
108 మెయిల్ గార్డు జాబ్స్.
1166 ఎంటీఎస్ ఉద్యోగాలున్నాయి..
తెలంగాణ రాష్ట్రంలో:
1553 పోస్ట్ మాన్ ఉద్యోగాలు.
82 మెయిల్ గార్డ్ పోస్టులు.
878 ఎంటిఎస్ ఉద్యోగాలు ఉన్నాయి.

వయస్సు:
ఈ జాబ్ కోసం అప్లై చేసే అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుండి 32 ఏళ్ల మధ్య ఉంటే చాలు..
విద్యార్హతలు :
– పోస్ట్ మాన్ జాబు కైతే ఇంటర్ పూర్తి చేయాలి
– మెయిల్ గార్డ్ ఉద్యోగానికి 45 శాతం మార్కులతో పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి..
– అలాగే గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్ ఉత్తీర్ణత సాధించాలి..
-కంప్యూటర్ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి.
జీతభత్యాలు:
ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి 33,718 రూపాయల నుండి మొదలు35,370 రూపాయల వరకు ప్రతి నెల జీతం వస్తుంది.
అప్లై చేసే విధానం:
– కింద ఉన్న ఒక లింకును క్లిక్ చేయండి..
– వెబ్ సైట్ లోకి ఎంటర్ అవ్వండి..
– మీ డాక్యుమెంట్స్ ను అప్ లోడ్ చేయండి.
– మీ ఫోటోని కూడా అప్ లోడ్ చేసేయండి.
– ఆ తర్వాత అప్లికేషన్ లో ఉన్న వివరాలను పూర్తి చేయండి.
– మరోసారి అన్ని చెక్ చేసుకోండి.
– ఇక చివరిగా మీ అప్లికేషన్ సబ్మిట్ చేయండి.

Apply Now

also read:

Visitors Are Also Reading