Home » NTRకు వెన్నుపోటు పొడిచిoది కూడా ప్రజల కోసమేనా అమ్మా? – చంద్రబాబు భార్యపై పోసాని సెటైర్లు

NTRకు వెన్నుపోటు పొడిచిoది కూడా ప్రజల కోసమేనా అమ్మా? – చంద్రబాబు భార్యపై పోసాని సెటైర్లు

by Bunty
Ad

చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి పై పోసాని కృష్ణ మురళి సెటైర్లు పేల్చారు. తన భర్త చంద్రబాబు నాయుడు ప్రజల కోసమే జీవితాన్ని ధారపోసారని భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై పోసాని కృష్ణ మురళి ఫైర్ అయ్యారు. నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి జైలు జీవితాన్ని అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కొంత మంది మాట్లాడుతుంటే… వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు అరెస్టును సమర్థిస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈతరుణంలోనే ఇవాళ పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ నిర్వహించారు.

 

posani krishna murali vs nara bhuvaneshwari

posani krishna murali vs nara bhuvaneshwari

నారా భువనేశ్వరి ములాఖాత్ కు వెళ్లొచ్చి ఏం మాట్లాడుతున్నారు..తన భర్త ఎప్పుడు ప్రజల కోసమే ఆలోచిస్తారు అని మాట్లాడారని పేర్కొన్నారు. మీ తండ్రి NTRను వెన్నుపోటు పొడిచిoది కూడా ప్రజల కోసమేనా అమ్మా?? కెసిఆర్ ను ఇబ్బంది పెట్టడానికి కూడా ఓటుకు నోటు ఇచ్చి అడ్డంగా దొరికిపోయిoది కూడా ప్రజల కోసమా అమ్మా ?? అంటూ చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి పై పోసాని కృష్ణ మురళి సెటైర్లు పేల్చారు. ఎవరైతే నిజంగా ప్రజలను ప్రేమిస్తాడో వాళ్ళే ఆ ఉన్నతమైన పదవి లో కూర్చుoటాడని తెలిపారు.

Advertisement

Advertisement

ABN,ఈనాడు అడ్డదారులు తొక్కితే ప్రజలు బుద్ధి చెబుతారు…రామోజీ రావు ఒక బ్రోకర్ అంటూ మండిపడ్డారు. Jr NTR సూపర్ స్టార్ అయ్యాక దగ్గరికి తీశారు… కానీ అప్పటివరకు ఈ ఫ్యామిలీ అంతా ఎలా వెలివేశారో అందరికీ తెలుసన్నారు. సీనియర్ ఎన్టీఆర్ కన్నా గొప్ప నటుడు… జూనియర్ NTR అని.. హరికృష్ణను కూడా చాలా ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ ను నమ్మండి…కులం, మతం… కొంత వరకూ ఉండాలి మితిమీరితే గజ్జి లాగా అవుతుందని అగ్రహించారు పోసాని. ఎయిర్ పోర్టులో జగన్ ను పొడిచినా.. గట్టి వాడు కాబట్టి బ్రతికారు… లేకపోతే నా లాంటివాడు అయితే ఈపాటికి మరణoచేవాడని సంచలన కామెంట్స్ చేశారు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading