Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » భీమ్లా నాయక్ టికెట్ల ఇష్ష్యు పై పోసాని సంచలన వ్యాఖ్యలు…!

భీమ్లా నాయక్ టికెట్ల ఇష్ష్యు పై పోసాని సంచలన వ్యాఖ్యలు…!

by AJAY
Ads

టాలీవుడ్ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి వైసీపీ సపోర్టర్ అన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నేడు పోసాని తాడేప్లిగూడెంలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి సీఎం జగన్ ను కలిశారు. సమావేశం అనంతరం పోసాని మీడియాతో మాట్లాడారు. ఈ భేటీ వ్యక్తిగతమైనదని ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని అన్నారు.

Advertisement

Ad

కానీ మీడియా ప్రతినిధులు మాత్రం పలు ఆసక్తికర ప్రశ్నలు వేయగా వాటికి పోసాని సమాధానం ఇచ్చారు. సీఎం ను కలవడానికి కారణం తన కుటుంబం కరోనా తో బాధపడుతున్న సమయంలో లో సీఎం జగన్, ఆయన సతీమణి మాట సాయం చేశారని అన్నారు. ఏఐజీ ఆస్పత్రికి ఫోన్ చేసి మెరుగైన చికిత్స అందే విధంగా చర్యలు తీసుకున్నారు అని పోసాని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా సినిమా టికెట్ల అంశం పై ఏపీ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని అన్నారు. చిన్న సినిమాల ప్రతిపాదనలు అందిన తరవాతే టికెట్ల అంశం పై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

Advertisement

Bheemla nayak

సీఎం తో సమావేశం లో సినిమా టికెట్ల అంశం పై తాము చర్చించలేదు అన్నారు. అలీకి ఇస్తున్నట్టు గా తనకు కూడా పదవి ఇస్తారని చెబుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. అంతే కాకుండా భీమ్లా ఏపీ టికెట్ల అంశం పై పోసాని మాట్లాడుతూ….తనకు సినిమా టికెట్ల గురించి తెలియదు అన్నారు. తాను సినిమా వాడినే అయినా భీమ్లా సినిమా టికెట్ల వివాదం తనకు తెలియదు అన్నారు.

Visitors Are Also Reading