Home » పవన్ ను కించపరిచేలా వీడియో…లైక్ కొట్టిన పూనమ్ కౌర్…!

పవన్ ను కించపరిచేలా వీడియో…లైక్ కొట్టిన పూనమ్ కౌర్…!

by AJAY
Ad

టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందం తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అంతే కాకుండా వివాదాస్పద నటిగా సైతం పూనమ్ కౌర్ ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై పూనమ్ అప్పట్లో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత కొందరు తనతో అలా ఆర్జీవీ మాట్లాడించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

Advertisement

అంతే కాకుండా పవన్ కళ్యాణ్ పై పొగడ్తల వర్షం కురిపించింది. ఇక పూనమ్ కౌర్ వ్యవహారం ముందు నుంచి ఇదే విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి కామెంట్స్ చేస్తుందో… ఎవరిని ఉద్దేశించి కామెంట్లు చేస్తుందో చెప్పడం చాలా కష్టం. కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ ను ఉద్ధేశించి కామెంట్ లు చేసినట్టుగా అనిపిస్తుంది. అదే విధంగా మరి కొన్ని సార్లు దర్శకుడు త్రివిక్రమ్ పైనా ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేస్తుంది.

Advertisement

ఇక మరికొన్ని సందర్భాల్లో అయితే వరుస ట్వీట్ లు చేసి వెంటనే వాటిని డిలీట్ చేస్తూ కూడా ఉంటుంది. అయితే తాజాగా పూనం కౌర్ చేసిన ఒక పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో తన పక్కన ఉన్న వ్యక్తులకు షేక్ హ్యాండ్ ఇస్తుండగా తనకు ఇస్తున్నారు అనుకుని ముందుగా చేతిని ఇస్తారు..కానీ పక్కన ఉన్న వ్యక్తికి ఇవ్వడంతో అది కాస్త కాస్త ఫన్నీగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలను ఇస్తూ ఓ వ్యక్తి ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఇక ఈ వీడియోకు పూనమ్ కౌర్ లైక్ చేసింది. దాంతో ఈ వీడియోకు పూనమ్ ఎందుకు లైక్ కొట్టిందా అని అభిమానులు అనుకుంటున్నారు.

Visitors Are Also Reading