Home » పవన్ కళ్యాణ్ తో సినిమా పై పూనమ్ సంచలన వ్యాఖ్యలు….!

పవన్ కళ్యాణ్ తో సినిమా పై పూనమ్ సంచలన వ్యాఖ్యలు….!

by AJAY
Ad

టాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్ లు సినిమాలతో పాపులారిటీ సంపాదించుకుంటే మరికొందరు మాత్రం వివాదాలతో పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటి హీరోయిన్స్ లో పూనమ్ కౌర్ కూడా ఒకరు. పూనమ్ కౌర్ కెరీర్ ప్రారంభం లో బడా హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్నప్పటికి హీరోయిన్ గా నిలదొక్కుకాలేకపోయింది.

Advertisement

ఇక పూనమ్ కౌర్ సినిమా ప్రస్థానం లో ఎన్నో వివాదాలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ పూనమ్ కౌర్ కెరీర్ పై ఎక్కువ ప్రభావాన్ని చూపింది. నిజానికి ఏం జరిగిందో ఎవరికీ తెలియదు కానీ పూనమ్ పవన్ ల మధ్య ఏదో జరిగింది అంటూ వార్తలు గుప్పుమన్నాయి. పూనమ్ కూడా లో సారి పవన్ పై పాజిటివ్ గా స్పందిస్తే మరోసారి నెగిటివ్ గా స్పందిస్తూ ఉంటుంది.

Advertisement

ఇక కొంతకాలం గా సినిమాలకు దూరంగా ఉన్న పూనమ్ కౌర్ మళ్లీ రీఎంట్రీ ఈనేపథ్యంలో లోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. కాగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్ తో వివాదం గురించి మాట్లాడాలి అని యాంకర్ పూనమ్ కౌర్ ను అడిగారు.

దాంతో పూనమ్ నవ్వుతూ కాస్త ఎమోషనల్ అయ్యింది. కాంట్రవర్సీ ..ఇంకేం చెప్పను ఇదే ఫ్యాక్ట్ కదా…అంటూ ఆన్సర్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ తో యాక్ట్ చేశారు కదా అంటూ ప్రశ్నించగా…నేను చేయలేదు…చాలా మంది చేయనివ్వలేదు అంటూ నవ్వుతూనే ఆన్సర్ ఇచ్చింది.

Visitors Are Also Reading