Home » వెంకటేష్ చెల్లెలుగా పూజా హేగ్దే…?

వెంకటేష్ చెల్లెలుగా పూజా హేగ్దే…?

by Azhar
Ad

విక్టరీ వెంకటేష్ గురించి మన తెలుగు సినిమా అభిమానులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రొడ్యూసర్ డీ రామానాయుడు కొడుకు గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్… తన నటనతో తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలు చేసినా వెంకటేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువమంది ఉంటారు ఇప్పటికీ కూడా మన టాలీవుడ్ లో ఈయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సోలో సినిమాలు చేస్తూనే… యంగ్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తున్న వెంకటేష్ ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలిసి F3 అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 27న అభిమానుల ముందుకు రాబోతోంది.

Advertisement

అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన F2 మంచి హిట్ కావడంతో దాని సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒక్కరు అయిన పూజాహెగ్డే ఓ ప్రత్యేక పాటలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న ఓ ప్రచారం ఏమిటంటే…. పూజాహెగ్డే విక్టరీ వెంకటేష్ ఇద్దరూ ఓ సినిమాలో అన్నా చెల్లెలు గా నటించబోతున్నారు అని తెలుస్తుంది.

Advertisement

అయితే వెంకటేష్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు అనే విషయం అందరికి తెలిసిందే. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న కభీ ఈద్ కభీ దివాళీ అనే సినిమాతో హిందీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు వెంకటేష్. ఫర్హద్ సంజి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా లో ఓ ప్రత్యేకమైన రోల్ కోసం వెంకటేష్ ను తీసుకున్నాడు సల్మాన్. అయితే ఇందులోనే వెంకటేష్ చెల్లెలుగా పూజాహెగ్డే నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో విడుదల అవుతోంది అనుకుంటున్న ఈ సినిమాలో వీరిద్దరూ అన్నా చెల్లెలు గా నటించడం పెద్ద చర్చకు దారితీస్తోంది. అభిమానులు కూడా దీనిపైన రక రకాలుగా స్పందిస్తున్నారు

ఇవి కూడా చదవండి :

కోహ్లీ నవ్వు అనుష్కకి నచ్చడం లేదా…?

ఉమ్రాన్ కు టీం ఇండియాలో చోటు ఖాయం : గంగూలీ

Visitors Are Also Reading