Home » విజ‌య్ సినిమాకు బై చెప్పిన పూజా…

విజ‌య్ సినిమాకు బై చెప్పిన పూజా…

by Bunty
Ad

ద‌క్షిణాది చిత్రాల‌తో పాటుగా ఉత్త‌రాది బాలీవుడ్ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్న ఏకైక న‌టి పూజా హెగ్డే. డీజే సినిమాతో పూజా లక్ మారిపోయింది. వ‌ర‌స‌గా సినిమాలు చేస్తూ బిజీ తార‌గా మారిపోయింది. త‌మిళంలో విజ‌య్‌తో క‌లిసి బీస్ట్ సినిమాలో న‌టిస్తున్న‌ది. ఈ సినిమాలో ఆమె పాత్ర‌ను కంప్లీట్ చేసింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా పూజా తెలియ‌జేసంది.
Pooja Hegde finishes her shooting part in Beast
స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర‌పై ద‌ర్శ‌కుడు నెల్స‌న్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా దాదాపు పూర్తికావొచ్చింది. బీస్ట్ సినిమాకు సంబంధించి చిత్రీకర‌ణంతా పూర్త‌యింద‌ని, ఈ సినిమాకు ప‌నిచేయ‌డం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్ అని చెప్పింది పూజా. యూనింట్ అంతా క‌ష్ట‌ప‌డి, ఇష్ట‌ప‌డి, ప్రేమించి సినిమా చేశామ‌ని, థియేట‌ర్స్‌లో సినిమాను చేసే ప్రేక్ష‌కులు బాగా ఎంజాయ్ చేస్తార‌ని అన్నారు. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను బాగా ఎంట‌ర్‌టైన్ చేస్తుంద‌ని తెలిపారు. పూజా న‌టించిన సినిమాలు రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్నాయి. జ‌న‌వ‌రి 14న రాధేశ్యామ్, ఫిబ్ర‌వ‌రి 4న ఆచార్య రిలీజ్ కానున్నాయి. వ‌చ్చే ఏడాది దీపావ‌ళి కానుక‌గా ఈ చిత్రాన‌ని రిలీజ్ చేయ‌నున్నారు. ల‌క్‌తో పాటుగా అవ‌స‌ర‌మైనంత గ్లామ‌ర్‌ను ఒల‌క‌పోసేందుకు ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌డం లేదు పూజా. స్టార్ హీరోల‌తో చేస్తున్న సినిమాలు హిట్ అవుతుండ‌టంతో అడిగినంత రెమ్యున‌రేష‌న్‌ను కాద‌న‌కుండా ఇస్తున్నారు నిర్మాత‌లు.

Advertisement

Visitors Are Also Reading