ప్రభాస్ పూజా హెగ్డే జంటగా నటించిన రాధే శ్యామ్ సినిమా మార్చి 11న విడుదలైంది. ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. అయితే తాజాగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న హీరోయిన్ పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్ తో మళ్ళీ పనిచేయాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టింది. రాధే శ్యామ్ సినిమా కోసం ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది.
Advertisement
Advertisement
మళ్ళీ ప్రభాస్ తో ఒక సినిమా చేయాలని ఉందని మనసులో మాటను బయట పెట్టేసింది.అంతే కాకుండా ఒకవేళ తనకు ఛాన్స్ వస్తే బాహుబలి 3 చేయాలని అందులో తననే హీరోయిన్ గా తీసుకోవాలని కూడా చెబుతా అని వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా రాజమౌళి బాహుబలి 3 కూడా ఉంటుంది అని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జక్కన్న ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబు తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తరవాత మళ్లీ బాహుబలి 3 ప్రారంభించే అవకాశం ఉంది.
Advertisement