దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. అన్ని పార్టీలు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో రాజకీయ అభ్యర్థుల భవితవ్యం ఈనెల 10న తేలిపోనున్నది. ఈ తరుణంలో పంజాబ్‌లో లడ్డూలకు బాగా గిరాకీ ఏర్పడింది. ఎన్నికల ఫలితాలకు ముందు పలు రాజకీయ పార్టీల నుంచి లడ్డూల కోసం ఆర్డర్లు పోటెత్తాయి.
Advertisement
ఈ ఎన్నికలలో విజయం సాధించిన అభ్యర్థులు సంబురాలలో భాగంగా మిఠాయిలు పంచుకోవడం మామూలే. దీంతో విజయంపై ధీమాతో పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు లడ్డూలకు భారీగా ఆర్డర్లు ఇచ్చారు. దీంతో స్వీట్లు తయారీదారులకు చేతినిండా పని లభించింది. క్షణం తీరిక లేకుండా లడ్డూల తయారీలో సతమతమవుతున్నారు. వారు భారీ సంఖ్యలో లడ్డూలు తయారు చేస్తున్నారు.
Advertisement
ఇటీవల పలు ఎగ్జిట్‌పోల్స్ పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని నివేదికలు ఇచ్చాయి. మొత్తం 117 స్థానాలకు ఆప్ 70 నుంచి 100 స్థానాల వరకు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ, ఇండియా టూడే, చాణక్య సంస్థలు చెప్పగా.. ఏబీపీ-సీ ఓటర్ మాత్రం ఆప్-57, కాంగ్రెస్ 26, అకాలీదళ్ 24, బీజేపీ -10 గెలుచుకుంటుందని వెల్లడించింది. గెలుపు ఎవరిదో ఈనెల 10న స్పష్టం కానున్నది.
Also Read : Anchor Anasuya: అనసూయ ట్వీట్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్స్ ఇవే..!