Home » బెల్లకొండ సురేష్‌, శ్రీ‌నివాస్‌ల‌పై కేసు న‌మోదు.. ఎందుకంటే..?

బెల్లకొండ సురేష్‌, శ్రీ‌నివాస్‌ల‌పై కేసు న‌మోదు.. ఎందుకంటే..?

by Anji
Ad

సినీ ప‌రిశ్ర‌మ అన్న‌ప్పుడు నిర్మాత‌ల‌కు, ఫైనాన్షియ‌ర్ల‌కు మ‌ధ్య గొడ‌వ‌లు త‌రుచూ జ‌రుగుతూనే ఉంటాయి. ఒక‌రి పై మ‌రొక‌రు పోలీసు కేసులు కూడా పెట్టుకుంటూనే ఉంటారు. తాజాగా టాలీవుడ్ బ‌డా నిర్మాత బెల్లంకొండ సురేష్ పై ఓ ఫైనాన్షియ‌ర్ పోలీస్ కేసు న‌మోదు చేయ‌డం ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారింది.

Advertisement

Advertisement

ముఖ్యంగా కేవ‌లం నిర్మాత బెల్లంకొండ సురేష్‌పైనే కాకుండా ఆయ‌న కుమారుడు హీరో బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ పై కూడా కేసు న‌మోదు చేయ‌డం గ‌మ‌నార్హం. వివ‌రాల్లోకి వెళ్లితే.. బెల్లంకొండ సురేష్‌, శ్ర‌వ‌ణ్‌కుమార్ అనే వ్య‌క్తి వ‌ద్ద కొత్త సినిమా కోసం 2018-19 మ‌ధ్య‌లో 50 ల‌క్ష‌లు తీసుకున్నాడ‌ని, త‌రువాత సినిమా గురించి ఎటువంటి అప్‌డేట్ లేక‌పోవ‌డంతో త‌న డ‌బ్బులు రిట‌ర్న్ అడిగితే చంపేస్తామని బెద‌రిస్తున్నార‌ని భ‌య‌ప‌డి కోర్టును ఆశ్ర‌యించిన‌ట్టు చెప్పుకొచ్చాడు. కోర్టు ఆదేశాల‌తో శ్ర‌వ‌ణ్‌కుమార్ ఇచ్చిన ఆధారాల ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్టు స‌మాచారం. దీనిపై బెల్లంకొండ కుటుంబం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి మ‌రీ.

Visitors Are Also Reading