Home » చెన్నై టీమ్ నిషేదించాలని అసెంబ్లీలో డిమాండ్.. ఎందుకోసం అంటే ?

చెన్నై టీమ్ నిషేదించాలని అసెంబ్లీలో డిమాండ్.. ఎందుకోసం అంటే ?

by Anji
Ad

తమిళనాడుకు చెందిన ఒక్క ఆటగాడు లేని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై నిషేదం విధించాలని బమాక ఎమ్మెల్యే తమిళనాడు శాసనసభలో కోరారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ని రద్దు చేయాలంటూ.. అసెంబ్లీలో రగడ మొదలైంది. ఈమేరకు తమిళనాడు అసెంబ్లీలో పీఎంకే పార్టీ డిమాండ్ చేసింది.  

Also Read :  వరుస పరాజయాలతో కోహ్లీ పరేషాన్.. టెన్షన్ తగ్గించిన కూతురు..!

Advertisement

ఇవాళ తమిళనాడు శాసనసభలో రాష్ట్ర క్రీడాశాఖపై చర్చలు కొనసాగాయి. అందులో బమాగకు చెందిన ధర్మపురి ఎమ్మెల్యే వెంకటేశ్వరన్ మాట్లాడుతూ.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై నిషేదం విధించాలని డిమాండ్ చేసారు. తమిళనాడు జట్టుగా ప్రచారం చేస్తూ ప్రజల నుంచి లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. చెన్నై జట్టులో తమిళనాడుకు చెందిన ఒక్క ఆటగాడు కూడా లేకపోవడం దారుణమన్నారు. 

Advertisement

Manam News

తమిళనాడు క్రీడాశాఖ దీనిపై ఎందుకు స్పందించడం లేదంటూ సూటిగా ప్రశ్నించారు. తమిళనాడులో ప్రతిభవంతులైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఒక్కరిని కూడా ఎంపిక చేయలేదని, తమిళులు లేకుండా తమిళనాడు జట్టు అంటూ ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. వారి లాభం కోసం ఇలా చేస్తున్నారని ఎమ్మెల్యే వెంకటేశ్వరన్ పేర్కొన్నారు. అదేవిధంగా తమిళులు లేని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై తమిళనాడు ప్రభుత్వం నిషేదం విధించాలని శాసనసభలో పట్టుబట్టారు.  

Also Read :  ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో 99 పరుగులతో నాటౌట్ గా నిలిచిన ప్లేయర్లు వీరే..!

Visitors Are Also Reading