Home » ప్రధాని కోసం గరిట తిప్పుతానంటున్న యాదమ్మ..?

ప్రధాని కోసం గరిట తిప్పుతానంటున్న యాదమ్మ..?

by Sravanthi
Ad

దేశానికి ప్రధాని ఆయన తినే ఫుడ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు, ఎన్నో రుచికరమైన వంటకాలు ఉంటాయి. కనీసం ఆయన తినాలంటే 5 స్టార్ హోటల్లలో ఆరితేరిన వంట వాళ్ళు అయి ఉండాలి.. ఎందుకంటే ఆయన దేశ ప్రధాని.. కానీ ప్రధాని మోడీకి జూలై 2,3  తేదీన వంట చేసేది ఫైవ్ స్టార్ హోటల్ వాళ్లయితే కాదు.. మారుమూల పల్లెలో పుట్టిన అది సామాన్యమైన ఒక మహిళ చేతి రుచులు చూపించబోతున్నారు.. మరి ఇంతకీ మోడీకి వంట వండి, వడ్డించే ఆ మహిళ ఎవరో తెలుసుకోవాలని ఉంది కదూ.. ఆమె పేరు యాదమ్మ .. ఆమె చేసే స్పెషల్ ఏమిటి.. ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..?

యాదమ్మ ఒక సామాన్య కుటుంబానికి చెందిన మహిళ. చిన్నతనంలోనే పెళ్లి అయింది. ఆమెది పాత కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి గ్రామానికి చెందినది. భర్త పేరు చంద్రయ్య. కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వారు.. ఒకరోజు భర్త బావిలో పూడిగ పనులు చేయడానికి వెళ్ళినప్పుడు మట్టి పెల్లలు మీద కూలి మరణించారు. దీంతో యాదమ్మ విగతజీవిగా మిగిలిపోయింది. అత్తింటి నుంచి వేధింపులు. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటికే మూడు నెలల చంటి బిడ్డ. బిడ్డను చంకనేసుకొని బతుకు తెరువు కోసం కరీంనగర్ బాట పట్టింది. చాలా కష్టపడింది. ఒక స్కూల్లో ఆయాగా చేరింది. తర్వాత పెద్ద పెద్ద సంపన్నుల, రాజకీయ నాయకుల ఇళ్లలో వంట మనిషిగా చేరి వంటలు చేస్తుండేది.

Advertisement

Advertisement

 

ఈ విధంగా అక్కడే వెంకన్న అనే వంట మాస్టర్ దగ్గర సహాయకురాలిగా చేరి ఎలాంటి వంట అయినా చేసే సామర్థ్యాన్ని సంపాదించుకుంది. ఈ విధంగా 30 ఏళ్ల నుంచి కరీంనగర్ లో వంట మాస్టర్ గా చాలా పేరు సంపాదించుకుంది. ఆమె చేతి వంట రుచి చూసిన వారు మరోసారి కావాలనిపించే విధంగా వంట చేస్తుంది. ఆమె కింద దాదాపుగా వందలాది మంది పనిచేస్తున్నారు. వారందరికీ బతుకుతెరువు చూపిస్తూ, తాను బ్రతుకుతుంది. దాదాపుగా 20 వేల మందికి పైన వంటలు, వండి వడ్డించే సామర్థ్యం సంపాదించింది. ఇప్పటికే మంత్రి కేటీఆర్, గంగుల కమలాకర్ లాంటి నాయకులు పాల్గొన్న కార్యక్రమాల్లో కూడా వంటలు చేసి మెప్పించింది.

దీంతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆమెను బుధవారం హైదరాబాద్ పిలిపించుకొని ఆమెతో కొన్ని వంటలు తయారు చేయించి రుచి చూశారు. అవి బాగా నచ్చడంతో ప్రధాని మోడీకి బండి సంజయ్ యాదమ్మ వంటకాల గురించి చెప్పారని తెలుస్తోంది. ఆమెతో ఫైవ్ స్టార్ హోటల్లో ఉండే చెఫ్ లకు ట్రైనింగ్ ఇప్పించారట. అయితే మోడీకి తెలంగాణ వంటకాలు అయిన పప్పు, దద్దోజనం, పులిహోర, గంగవాయిలికూర, పచ్చి పులుసు, గుత్తి వంకాయ, గారెలు,అరిసెలు, సర్వపిండి, సకినాలు, భక్షాలు, పాయసం, మక్క గారెలు వంటి తెలంగాణ రుచులను ఆమెతో వండించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోడీ సార్ నేను చేసే వంట తింటారు అంటే, అంతకంటే నా జీవితానికి కావలసిన భాగ్యం ఏముంటుంది అని ఆనందం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం యాదమ్మ గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

also read;

జీవిత భాగస్వాములకు పోగొట్టుకున్న టాలీవుడ్ స్టార్స్..ఎవరంటే..?

ద‌మ్ముంటే ఆ ప‌ని చెయ్…న‌రేష్ కు రెండో భార్య స‌వాల్..!

 

Visitors Are Also Reading