Home » స‌లార్‌పై క్రేజీ బ‌జ్‌.. త్వ‌ర‌లో అనౌన్స్‌మెంట్

స‌లార్‌పై క్రేజీ బ‌జ్‌.. త్వ‌ర‌లో అనౌన్స్‌మెంట్

by Anji
Ad

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌లార్. ఇందులో ప్ర‌భాస్ కు జోడిగా శృతిహాస‌న్ న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో ఏక‌కాలంలో చిత్రీక‌రించి హిందీ, త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల్లోకి డ‌బ్ చేయ‌నున్నారు. హోంబ‌లే ఫిల్మ్ బ్యాన‌ర్ పై విజ‌య్ కిరగందూర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ర‌వి బ‌స్రూర్ సంగీతం స‌మ‌కూర్చారు. అండ‌ర్ వ‌ర‌ల్డ్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్‌-14 ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్న‌ది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెబ‌ల్ స్టార్ అభిమానులను థ్రిల్ చేస్తోంది.

salaar

Advertisement

Advertisement

ఇంత‌కు ఆ బ‌జ్ ఏమిటంటే స‌లార్ రెండు భాగాలుగా రాబోతుంద‌ట. దీనికి సంబంధించిన అఫిషియ‌ల్ అనౌన్స్‌మెంట్ త్వ‌ర‌లో రాబోతుంద‌ని.. ఇంత‌కు ముందు బాహుబ‌లి మాదిరిగానే హిస్టరి రిపీట్ అవుతుంద‌ని పేర్కొంటున్నారు. అభిమానుల వ‌రుస ట్వీట్ల‌తో ప్ర‌భాస్ స‌లార్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ వార్త గురించి మేక‌ర్స్ ఏమని అంటారో చూడాలి మ‌రి. స‌లార్‌లో భావోద్వేగాల‌తో కూడిన హై ఓల్టేజ్ యాక్ష‌న్ స‌న్నివేశాలున్నాయి. మిలిట‌రీ ట్యాంకులు, జీపులు, రైఫిల్స్‌, మెషిన్ గ‌న్‌లు, విమానాల‌ను కొన్ని యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌లో ఉప‌యోగిస్తున్నార‌ట‌. క్లైమాక్స్ సీన్ కోసం దాదాపు 80 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

Visitors Are Also Reading