దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో ఏకంగా రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న హిస్టారికల్ డ్రామా సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా కోసం దేశం మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. జనవరి 07 విడుదలవ్వాల్సి ఉండగా ఒమిక్రాన్, కరోనా విస్తరిస్తుండడంతో వాయిదా వేశారు. మరోవైపు ప్రీ రిలీజ్, ప్రమోషన్లలో ఆర్ఆర్ఆర్ దాదాపుగా పాతిక కోట్ల వరకు నష్టపోయిందని టాక్ వినిపిస్తోంది.
Advertisement
Advertisement
ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు తాజాగా ఒక తలనొప్పి వచ్చి పడింది. ఏమిటంటే హై కోర్టులో ప్రజాప్రయోజన వ్యాఖ్యం దాఖలు అయింది. ఈ ఫిల్ ను పశ్చిమగోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరంకు చెందిన అల్లూరి సౌమ్య ఆర్ఆర్ఆర్ సినిమాపై హై కోర్టులో ఫిల్ దాఖలు చేసారు. ఆమె ముఖ్యంగా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ కూడా ఇవ్వవద్దు అని విడుదలపై స్టే ఇవ్వాలని పిటిషన్‌లో కోరింది.
Advertisement
ఇక పోతే ఇది ఫిల్ కాబట్టి సీజే ధర్మాసనం విచారణ జరుపుతుందని జస్టీస్ ఉజ్జల్ భయాన్ బెంచ్ తెలిపింది. కానీ ఈ విషయంపై చిత్ర యూనిట్ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి మరీ.