Home » నాగ శౌర్య ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ట్రైలర్ రిలీజ్

నాగ శౌర్య ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ట్రైలర్ రిలీజ్

by Bunty
Ad

యంగ్ హీరో నాగశౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్’ అనే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా బ్రేక్ అందుకున్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు శౌర్య.

read also : “పవన్ కళ్యాణ్” వదిలేసిన సినిమాలతో స్టార్స్ గా ఎదిగిన హీరోలు వీళ్లే!

Advertisement

ఆ తర్వాత దిక్కులు చూడకు రామయ్య, ఓ బేబీ, ఛలో వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. రీసెంట్ గా ‘కృష్ణ వింద విహారి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ సినిమా పేరు ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఈ సినిమాకు శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

ఇవి కూడా చదవండి : Shakib Al Hasan : అభిమానిని దారుణంగా కొట్టిన బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌

Naga Shaurya: 'ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి' ట్రైలర్

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల నాగశౌర్య వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ టైటిల్ చూస్తేనే ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్ లో ఉంటుందని అర్థం అవుతోంది. ఈ మూవీలో నాగశౌర్యకు జోడిగా మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో శౌర్య రెండు దశలలో కనిపించారు. ఒకటి కాలేజీ కుర్రాడిగా, ఆ తర్వాత యుక్త వయసుకుడిగా నటించారు. నాగశౌర్య, మాళవిక నడుమ ఆహ్లాదకరమైన రొమాన్స్ ఆకట్టుకుంటుంది.

Visitors Are Also Reading