ఉక్రెయిన్ రష్యా యుద్దంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగాయి. యుద్దం ప్రారంభం కాకముందు క్రూడాయిల్ ధర 95 డాలర్లు ఉండగా పది రోజుల తరవాత క్రూడాయిల్ బ్యారెల్ ధర 125 డాలర్లకు చేరింది. దాంతో ఇంధనం కోసం దిగుమతులపైన ఆధారపడే దేశాలలో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే మన దేశంలో మాత్రం క్రూడాయిల్ ధరలు పెరిగినా ఇంకా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచలేదు.
Advertisement
Advertisement
దానికి కారణం దేశంలో ఐదు రాష్ట్రాల్లోఎన్నికలు ఉండటమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలను పెంచితే ఆ ఎఫెక్ట్ పడుతుందనే కారణంతోనే ధరలను పెంచడం లేదని కానీ సోమవారంతో ఎన్నికలు ముగుస్తుండటంతో పెట్రోల్ డీజిల్ ధరలను పెంచే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా పెట్రోల్ డీజిల్ ధరలు ఏకంగా రూ.15 నుండి రూ.20వరకూ పెరిగే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి.