Home » చిత్రం బళారే విచిత్రం.. ఏనుగులను మనిషిలా పరిగణించాలని కోర్టులో పిటిషన్.. చివరికి..?

చిత్రం బళారే విచిత్రం.. ఏనుగులను మనిషిలా పరిగణించాలని కోర్టులో పిటిషన్.. చివరికి..?

by Sravanthi
Ad

న్యూయార్క్ హైకోర్టు కోర్ట్ ఆఫ్ అప్పిల్స్ ఒక విచిత్రమైన కేసును విచారణ చేస్తోంది. 51 సంవత్సరాల హ్యాపీ అనే ఆసియా ఎలిఫెంట్ ను బ్రోంక్స్ జూలో చట్టవిరుద్ధంగా బంధించారు అంటూ జంతు హక్కుల సంస్థ నాన్ హ్యూమన్ రైట్స్ ప్రాజెక్ట్ కింద హేబియస్ కార్పస్ పిటీషన్ ను వేసింది. అయితే హెబియస్ కార్పస్ ను మనిషిని నిర్బంధించడం చట్టబద్ధమైనదో లేదో నిర్ధారించడం కోసం ఉపయోగిస్తారు. అయితే హ్యాపీ అనే ఏనుగు తరఫు న్యాయవాది ఎలిఫెంట్ ఇష్టానికి వ్యతిరేకంగా జూలో బందించారని ఏనుగు చాలా తెలివైన జంతువు కాబట్టే దీనికి అన్ని రకాల హక్కులు మనుషులకు ఉండే విధంగా ఉండాలని అంటున్నారు. అంతేకాకుండా ఈ ఏనుగు 1977 నుండి జూలో నిర్భందించబడిందని ఇప్పటికైనా దాన్ని ఏనుగుల అభయారణ్యంలోకి తరలించాలని కోరాడు.

 

Advertisement

Advertisement

కానీ బ్రోంక్స్ జూ యాజమాన్యం మాత్రం మేము చాలా బాగా చూసుకుంటున్నామని అది చట్టవిరుద్ధం కాదని అంటున్నారు.2018 లో దాఖలైనటువంటి ఈ విచిత్రమైన కేసు దిగువ కోర్టులో ఓడిపోతు వస్తోంది. ఈ కేసు అత్యున్నత న్యాయస్థానానికి చేరడంతో మరి ఈ ధర్మాసనం ఏనుగును వ్యక్తిలా పరిగణిస్తుందా లేదా అనేది తీర్పు పైన ఆధారపడి ఉన్నదని ది వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొన్నది. ఈ కేసు పూర్తి తీర్పు వచ్చేవరకు ఏనుగు జూ లోనే ఉండాలని ఆదేశాలు ఉన్నాయి.

ALSO READ;

షుగర్ తో బాధపడుతున్నారా.. అయితే ఈ పండు తింటే ఇట్టే నయం అవుతుంది..!!

GEETU ROYAL:బిగ్ బాస్ OTT విన్నర్ ఎవరో చెప్పిన గీతు రాయల్..?

 

Visitors Are Also Reading