Home » రాజమౌళి వస్తే ఒక రేటు…రాకపోతే ఒక రేటు ఉండదు : పేర్ని నాని

రాజమౌళి వస్తే ఒక రేటు…రాకపోతే ఒక రేటు ఉండదు : పేర్ని నాని

by AJAY
Ad

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో రాజమౌళి భేటీ పై మంత్రి పేర్ని నాని స్పందించారు. సీఎం జగన్ తో రాజమౌళి భేటీలో తను లేనని పేర్ని నాని వెల్లడించారు. 5వ షోకు అనుమతి…. ప్రత్యేక టికెట్ ధరలు అందరికీ వర్తిస్తాయని స్పష్టం చేశారు. సినిమా టికెట్ల జీవోపై కృతజ్ఞతలు తెలపడానికి రాజమౌళి వచ్చారని పేర్ని నాని తెలిపారు. అంతే కాకుండా రాజమౌళి వచ్చి కలిస్తే ఒక రేటు…. రాకపోతే మరొక రేటు ఉండదని స్పష్టం చేశారు.

Advertisement

Advertisement

ఆర్ఆర్ఆర్ కు పోటీగా మరో సినిమా వచ్చినా ప్రత్యేక షో కు అనుమతి ఇవ్వాల్సిందేనని వ్యాఖ్యానించారు. అయితే గత కొంత కాలంగా ఏపీలో సినిమా టికెట్ల అంశంపై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త జీవోతో ఆ వివాదానికి తెరపడింది. దాంతో పలువురు సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

Visitors Are Also Reading