Home » రాజీనామా త‌ర‌వాత కూడా ప‌వ‌న్ ను వ‌ద‌లని పేర్నినాని..!

రాజీనామా త‌ర‌వాత కూడా ప‌వ‌న్ ను వ‌ద‌లని పేర్నినాని..!

by AJAY
Ad

ఏపీలో ప‌లువురు మంత్రులు త‌మ మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. అలా రాజీనామా చేసిన వారిలో మంత్రి పేర్నినాని కూడా ఉన్నారు. కాగా రాజీనామా అనంత‌రం పేర్నినాని కేబినెట్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ పై విమ‌ర్శ‌లు కురిపించారు. ప‌వ‌న్ క‌ల్యాన్ ఫుల్ టైమ్ పొలిటీషియ‌న్ కాద‌ని నాని అన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ హాబీగా మాత్ర‌మే రాజ‌కీయాలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. గ‌తంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌మ్యూనిస్టుల‌తో క‌లిసి బీజేపీని తిట్టిన విష‌యాన్ని కూడా నాని గుర్తు చేసుకున్నారు.

Advertisement

Advertisement

ఇప్పుడు బీజేపీతో క‌లిసి చంద్ర‌బాబుతో ట‌చ్ లో ఉన్నాడంటూ విమ‌ర్శించారు. అంతే కాకుండా ఒక‌ప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆఫీసు నిండా చెగువేరా ఫోటోలు ఉంటే ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇంటి నిండా చంద్ర‌బాబు ఫోటోలే ఉన్నాయంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక మంత్రి ప‌ద‌విలో ఉన్న సమ‌యంలో పేర్ని నాని ప‌లు మార్లు ప‌వ‌న్ క‌ల్యాణ్ పై విమ‌ర్శ‌లు కురిసిన సంగ‌తి తెలిసిందే. కాగా రాజీనామా చేసిన త‌ర‌వాత కూడా ప‌వ‌న్ పై విమ‌ర్శులు కురిపించ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్యపోతున్నారు.

Visitors Are Also Reading