Home » చిరంజీవి సినిమాకు చొక్కాలు చించుకున్నాం…కానీ : పేర్నినాని

చిరంజీవి సినిమాకు చొక్కాలు చించుకున్నాం…కానీ : పేర్నినాని

by AJAY

సినిమా టికెట్ల వివాదం ను ప‌రిష్క‌రించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఎంత‌గానో కృషి చేసిన సంగ‌తి తెలిసిందే. కొంత‌మంది న‌టులు ఏపీ ప్ర‌భుత్వం పై విమ‌ర్శులు చేయ‌డం…సెటైర్లు వేయడం లాంటివి చేయ‌గా చిరంజీవి మాత్రం ఎంతో సున్నితంగా వ్య‌వ‌హ‌రించారు. ఎక్క‌డా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడ‌కుండా స‌మ‌స్య ప‌రిష్కారినికి కృషి చేశారు. ఈ నేప‌థ్యంలోనే మెగాస్టార్ ను సీఎం జ‌గ‌న్ త‌న నివాసానికి ఆహ్వానించి మాట్లాడారు.

ఇక రెండో సారి చిరంజీవి మ‌రికొంద‌రు ఇండ‌స్ట్రీ కి చెంద‌ని స్టార్ హీరోలు, డైరెక్టర్లు మ‌రియు పెద్ద‌ల‌తో వెళ్లి సీఎం జ‌గ‌న్ తో స‌మావేశం అయ్యారు. అయితే తాజాగా ఏపీ మంత్రి పేర్నినాని చిరంజీవి పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి చేసిన కృషికి ప్ర‌భుత్వం నుండి అభినందిస్తున్నామని అన్నారు. చిరంజీవి స్థాయి ఏంటి పేర్నినాని స్థాయి ఏంటి…చిరంజీవి ఎన్నిసార్లు ఫోన్ చేశార‌నుకుంటున్నారు.

 

chiranjeevi

chiranjeevi

చిన్న పిల్లాడిలా మీకు ఫోన్ చేయొచ్చా నాని..మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు మాట్లాడ‌టానికి…అంటూ త‌న‌తో మాట్లాడార‌ని చెప్పారు. చిరంజీవి గారి సినిమాల‌కు టికెట్ల కోసం చొక్కాలు చించుకున్న మాకు ఎన్నింటికి ఫోన్ చేయాల‌ని ఆయ‌న అడిగారు. చిరంజీవి ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్కారం చేద్దాం అనుకున్నారు. నాని చిన్నోడా పెద్దోడా అని చూడ‌లేదు….అంటూ పేర్నినాని వ్యాఖ్యానించారు.

Visitors Are Also Reading