Home » బ్రష్ చేసేటప్పుడు చాలా మంది చేసే తప్పులు ఇవే..?

బ్రష్ చేసేటప్పుడు చాలా మంది చేసే తప్పులు ఇవే..?

by Azhar
Ad

ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ఉదయాన్నే లేవగానే చేసే మొట్టమొదటి పనులలో పళ్ళు తోముకోవడం అనేది తప్పకుండా ఉంటుంది. తమ నోటిని శుభ్రంగా ఉంచుకోవడానికి అలాగే టీత్ ను బలంగా ఉంచుకోవడానికి చాలామంది బ్రషింగ్ చేస్తారు. కానీ ఓ తాజా సర్వే ప్రకారం తెలిసిందేమిటంటే ప్రపంచంలో 80 శాతం మందికి సరిగ్గా చేయడం బ్రష్ చేయడం ఎలాగో తెలియదు అని నిర్ధారణ అయింది. కాబట్టి ఇప్పుడు మనం బ్రష్ ఎలా చేయాలో తెలుసుకుందాం.

Advertisement

ముందుగా మనం వాడే బ్రష్ లలో మూడు రకాలు ఉంటాయి, హార్డ్, మీడియం, స్టాఫ్ అనే బ్రష్ లు ఉంటాయి. అయితే చాలామంది హార్డ్ బ్రష్ ని ఉపయోగిస్తే తమ పళ్ళు ఇంకా మంచిగా ఉంటాయని అనుకుంటారు. కానీ అది చాలా తప్పు. హార్డ్ బ్రష్ లను ఉపయోగించడం వల్ల మీ చిగుళ్లకు కు చాలా సమస్యలు వస్తాయి. అందుకని కేవలం సాఫ్ట్ బ్రష్లను మాత్రమే ఉపయోగించాలి.

Advertisement

ఇక బ్రష్ చేసే సమయంలో చాలామంది పళ్ళ పైన అడ్డంగా బ్రష్ చేస్తారు. అలా చేయకూడదు. మనం ముందుపళ్ళ పైన ఎప్పుడు నిలువుగా బ్రష్ చేయాలి. పై దవడ యొక్క పళ్ళపైన అయితే పైనుంచి కిందికి… కింది దవడ పళ్ళపైన అయితే కింది నుండి పైకి బ్రష్ చేయాలి. ఇక లోపలి వైపు ఉండే పళ్ళపైన నిలువుగా లేదా గుండ్రంగా బ్రష్ చేయాలి. అలా చేయకపోతే సెన్సిటివిటీ అనే సమస్య ఎక్కువగా వస్తుంది. ఇక బ్రష్ అయిన తర్వాత చాలామంది తమ పళ్ళను శుభ్రం చేసుకొని వెళ్ళిపోతారు. అలా చేయకుండా నోటిని కడిగిన తర్వాత… వేలితో చిగుళ్ల పైన మెల్లిగా రాయాలి. అలా చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి ఎటువంటి సమస్య రాకుండా చిగుళ్లు బలంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి :

సాహా చెప్పిందే నిజం.. మజుందార్ పై నిషేధం…!

నా ప్రదర్శన భారత జట్టులో స్థానం కోసం కాదు..!

Visitors Are Also Reading